Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఈ నెలాఖరులో మొదలు కానుంది. శ్రీలంక పర్యటనతో అతడు హెడ్ కోచ్‌గా బాధ్యతలను చేపట్టనున్నాడు. లంక పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత జట్టు ఈ నెల 22 తేదీన శ్రీలంక విమానం ఎక్కనున్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. గంభీర్ సహాయక సిబ్బందిగా ఎవరు ఉంటారు అనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కేకేఆర్‌లో గంభీర్‌తో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెన్ డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. అదే విధంగా ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసిన టి.దిలీప్‌ను రీటైన్ చేసుకున్నారట. అయితే.. ఒక్క బౌలింగ్ కోచ్ విషయంలోనే ఇంకా సందిగ్థత నెలకొందని, చర్చలు జరుగుతున్నట్లుగా పేర్కొంది.
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మెర్నీ మోర్కెల్‌తో చర్చలు జరుగుతున్నాయని, అతడు బౌలింగ్ కోచ్‌గా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. బీసీసీఐ సన్నిహిత వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని చెప్పింది. సోమవారం శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు బయలు దేరనుంది. టీమ్ఇండియాతో గంభీర్‌తో పాటు దిలీప్, నాయర్ లు కూడా వెళ్లనున్నారు. టెన్ డష్కాటే మాత్రం త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యాడు. సూర్య, గౌతీ కాంబినేషన్‌లో భారత జట్టు అద్భుత విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ షెడ్యూల్..
టీ20 సిరీస్..
తొలి టీ20 – జూలై 27న
రెండ టీ20 – జూలై 28న
మూడో టీ20 – జూలై 30న
వన్డే సిరీస్..
తొలి వన్డే – ఆగస్టు 2న
రెండో వన్డే – ఆగస్టు 4న
మూడో వన్డే – ఆగస్టు 7న
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.