ప్రజాశక్తి-అల్లూరి: ఎపిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. గోదావరి, శబరి నది పొంగి పొర్లడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విలీన మండలాలు ఏటపాక, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల దగ్గరకు వరద నీరు చేరుతుంది. ముంపు ప్రాంతాల్లో పోలవరం నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.