R Narayana Murthy నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన నారాయణ మూర్తి..శనివారం (జూలై 20న) క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన నారాయణమూర్తి..తన ఆరోగ్యం గురించి వివరాలు వెల్లడించారు.
ఆర్ నారాయణ మూర్తీ మాట్లాడుతూ..”దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను పూర్తి ఆరోగ్యంగా కోలుకోవడానికి వైద్య సేవలందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి, అక్కడ ఉన్న డాక్టర్స్ కు మరియు సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదములు” అని తెలిపారు.
అలాగే అనుక్షణం నాక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నానంటూ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.