Donald Trump Assassination Attempt: ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై జరిగిన ఈ దాడిలో తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి తర్వాత ప్రపంచమంతా ఈ విషయంపై చర్చించింది. ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని కొంత మంది పిల్లలు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో, ఉగాండాలోని పిల్లలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును పునఃసృష్టించారు. ఈ వీడియోలో ఒక పిల్లవాడు ట్రంప్‌లా నటించగా.. మరికొందరు పిల్లలు ఆయన భద్రతా సిబ్బందిగా, ప్రేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నాటకీయ సన్నివేశంలో అచ్చుగుద్దినట్లు ట్రంప్‌పై దాడి జరిగిన విధానాన్ని వీడియో రూపంలో చూపించారు. కాల్పులు జరగగానే సెక్యూరిటీగా వ్యవహరించే పిల్లలు వేగంగా ట్రంప్‌లా నటించే పిల్లవాడిని చుట్టుముట్టి, సురక్షితంగా తీసుకువెళతారు. ఈ వీడియో జులై 13న పెన్సిల్వేనియాలో ర్యాలీ సందర్భంగా ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడిన నిజ జీవిత సంఘటన ఆధారంగా చిత్రీకరించారు.
CHILDREN IN UGANDA RECREATE TRUMP SHOOTING
Source: bloodofficial0 on TikTok pic.twitter.com/mVVaqXhdiV
— Mario Nawfal (@MarioNawfal) July 17, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.