మనం ఏదైనా చిక్కుల్లో ఉన్నప్పుడు..ఎవరైనా వచ్చి..సాయం చేస్తే.. ప్రాణాలు లేచొచ్చినట్లు అనిపిస్తోంది. అదే విధంగా మనం ఏదైనా అత్యవసర పని మీద ట్రైన్, బస్సు వంటి వాటిని అందుకునేందుకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకుంటే..ఆందోళనకు గురవుతాము. ఇక మనం అందుకోవాల్సిన ట్రైన్ లేదా బస్సు ఆశలు వదిలేసుకుంటాం. అచ్చం ఇలాంటి పరిస్థితినే టెక్నాలజీ పరిశ్రమ సమాఖ్యా నాస్కామ్ వైస్ చైర్ పర్సన్, శాప్ ల్యాబ్స్ ఎండీ సింధు గంగాధరన్‌కి ఎదురైంది. ఆమె బెంగళూరులోని విమానాశ్రయానికి వెళ్తున్న క్రమంలో మార్గంమధ్యలో ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఇక తాను ఫ్లైట్ ను అందుకోలేనని టెన్షన్ లో ఉంది. ఇదే సమయంలో ఓ ఊబర్ డ్రైవర్ చేసిన పనికి ఆమె ఫిదా అయింది. మరి..అతడు ఏం చేశాడు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆదివారం పరిశ్రమ సమాఖ్యా నాస్కామ్ వైస్ చైర్ పర్సన్, శాప్ ల్యాబ్స్ ఎండీ సింధు గంగాధరన్ బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నెషన్ల్ ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు తన కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గం మార్గం మధ్యలో సింధు కారు బ్రేక్ డౌన్ అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉండడంతో ఇక తాను సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేని భావించింది. అంతేకాక ఇక తాను ఎక్కాల్సిన ఫ్లైట్ కూడా మిస్ అవుతుందని ఆమె ఆందోనలకు గురయ్యారు. ఇదే సమయంలో సింధుకు ఉబర్ డ్రైవర్ సాయపడ్డాడు. మయూర్ అనే 22 ఏళ్ల వ్యక్తి ఉబర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కారు నడుపుతునే కుటుంబానికి ఆర్థికంగా సాయపడుతున్నాడు.
ఇక ఆదివారం సింధు కారు బ్రేక్ డౌన్ అయిన విషయాన్ని మయూర్ గమనించాడు. ఆమె ఆందోళన చెందడాన్ని చూసి.. సాయం చేయాలని భావించాడు. ఇక తన డ్రైవింగ్ నైపుణ్యంతో తక్కువ సమయంలోనే సింధు గంగాధరన్‌ను విమానాశ్రయానికి చేర్చాడు. సరైన సమయానికి ఎయిర్‌పోర్ట్ చేరుకుని తాను వెళ్లాల్సిన విమానాన్ని సింధు అందుకున్నారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా సదరు ఉబర్ డ్రైవర్ మయూర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సింధు గంగాధరన్ ఓ పోస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో తనకు జరిగిన అనుభవాన్ని చెబుతూ.. తనను క్షేమంగా, సరైన సమయానికి ఎయిర్‌పోర్ట్ చేర్చిన ఉబర్ ఇండియా డ్రైవర్ మయూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలంటూ ఆమె రాసుకొచ్చారు.
ఆమె పని చేస్తున్న నాస్కామ్ సంస్థ ఇండియాలోనే ఓ ప్రధానమైన ప్రవేటు వాణిజ్య సంఘం. నాస్కామ్ అనేది భారతీయ ప్రభుత్వేతర వాణిజ్య సంఘం. ఇది దేశంలోని దాదాపు 10 వేల స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రారంభించారు. ఇది పరిశ్రమలకు వివిధ రకాల సేవలు అందిస్తుంది. ఇది 1988లో స్థాపించగా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా … సాంకేతిక రంగంలో కీలక సంస్థగా పని చేస్తుంది. అలాంటి ఈ సంస్ధకు సింధు గంగాధరన్ వైఎస్ చెర్ పర్సన్ గాపని చేస్తున్నారు. గతంలో ఏపీలో కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ ఐఏఎస్ అధికారికి ఓ యువకుడు బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం ఆ ఐఏఎస్ అధికారి.. తనకు సాయం చేసిన యువకుడిని ఇంటికి పిల్చుకుని సన్మానించారు.
My car broke down mid-way to the airport and I almost would have missed my flight …but thanks to Mayur from @Uber_India who brought my on time and safely to the airport 🙏🙏😊😊 #GratefulHeart pic.twitter.com/n9AXGaWWly
— Sindhu Gangadharan (@gangadharansind) July 18, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.