Unluckiest dismissal ever : క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. అలాంటివి చూసినప్పుడు కాసేపు మన కళ్లని మనమే నమ్మలేకపోతుంటాం. అయితే.. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంతటి దురదుష్టవంతుడు మరొకరు ఉండరు అని ఓ బ్యాటర్ పై జాలి చూపుతున్నారు. ఆ బ్యాటర్ ఔటైన విధానం అలాంటిది మరి.
ఈ ఘటన యార్క్‌షైర్ సెకెండ్ ఎలెవెన్, సోమర్‌సెట్ సెకెండ్ ఎలెవెన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. యార్క్‌షైర్ బౌలర్ బెన్ క్లిప్ బౌలింగ్‌లో సోమర్ సెట్ బ్యాటర్ లియోనార్డ్ స్ట్రైయిట్ షాట్ ఆడాడు. ఆ బంతి నాన్ స్ట్రైకర్ వైపుగా వచ్చింది. ఆ బాల్‌ను తప్పించుకునేందుకు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న క్యాసే అల్‌డ్రిడ్జ్ కిందకు వంగాడు. అయినప్పటికి బంతి అతడి భుజాలను తాకింది. ఆ వెంటనే బాల్ బౌలర్ దిశగా వెళ్లింది. బౌలర్ క్లిఫ్ చాలా సింపుల్‌గా క్యాచ్ అందుకున్నాడు. తాను కావాలని చేయలేదంటూ నాన్ స్ట్రైకర్ క్యాసే అల్‌డ్రిడ్జ్ సారీ చెప్పగా.. ఓకే అంటూ నిరాశతో లియోనార్డ్ మైదానాన్ని వీడాడు.
ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి దురదృష్ట వంతుడు మరొకరు ఉండని ఓ నెటిజన్ అనగా, దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడా ఏంటీ అని మరోనెటిజన్ కామెంట్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో సోమర్సెట్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ 16.5 ఓవర్లలో 125 పరుగులకు కూప్పకూలింది.
Unluckiest dismissal for a batter. pic.twitter.com/KosmygSPVX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.