UPSC aspirants death ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా.. ఓల్డ్ రాజేంద్రనగర్లో వరద నీరు పోటెత్తింది. దీంతో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. ఈ ఘటనలో ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదానికి మందు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
UPSC aspirants death
వరద నీరు బేస్మెంట్లోకి ప్రవేశించడంతో.. లోపలున్న విద్యార్థులు బయటకు వస్తున్న దృశ్యాలు నీటిలో నుంచి మెట్లు ద్వారా బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. లోపల ఉన్న విద్యార్థులు త్వరగా. త్వరగా బయటకు రావాలని ఓ వ్యక్తి సూచించడంతోపాటు.. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక లోపల ఉన్న విద్యార్థులు బయటకు వచ్చే లోపే వరద నీరు.. వారిని చుట్టుముట్టి ఉంటుందని పోలీసులు సైతం భావిస్తున్నారు.
UPSC aspirants death ప్రమాద ఘటనపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఘటనకు సంబంధించి భవనం యజమాని, కో ఆర్డినేటర్తోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 13 కోచింగ్ సెంటర్లను ఢిల్లీ నగర పాలిక సంస్థ అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ ఘటనపై రాజకీయ పార్టీలు స్పందించారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే.. ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల సామాన్యడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీజేపీ అయితే..ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడుతుంది. దేశ రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనలో లోపం.. ఈ ఘటన ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపిస్తుంది.
అంతేకాదు… ఇది ప్రభుత్వ చేసిన హత్య అన్నట్లుగా బీజేపీ అభివర్ణిస్తుంది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా.. ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. తానియా సోని (25), శ్రియా యాదవ్ (25), నవీన్ డెల్విన్ (25) మృతి చెందిన సంగతి తెలిసిందే.
Crime news: పరువు పోగొట్టుకున్న ప్రభుత్వ టీచర్ .. ఛీ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు
Updated Date – Jul 29 , 2024 | 01:57 PM
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.