Value Gold భారతీయులను, బంగారాన్ని విడదీయలేని పరిస్థితి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. బంగారం అండగా నిలుస్తుందనే ధైర్యంతో ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో బంగారాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది. అయితే బంగారాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే వాల్యూ గోల్డ్ కంపెనీ ఒక సదవకాశాన్ని తీసుకొచ్చింది. కాప్స్ గోల్డ్‌కు చెందిన ఈ సంస్థ గోల్డ్ విక్రయించే వారికి సదవకాశాన్ని తీసుకొచ్చింది.
ప్రస్తుతం బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి, చింతల్‌లో వాల్యు గోల్డ్ బ్రాంచీలు ఉండగా.. తాజాగా ఈ సంస్థ ప్రజల వద్దకే సేవలు అందించేదుకు మొబైల్ సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మొబైల్ వాహనం ప్రస్తుతం వరంగల్‌కు వచ్చింది. ఈ మొబైల్ ఆఫీస్‌లో మీ బంగారాన్ని సులభంగా విక్రయించుకోవచ్చు. మీ గోల్డ్ నాణ్యతను పరీక్షించి తక్షణమే డబ్బును పొందొచ్చు. తాకట్టు బంగారాన్ని విడుదల చేయడంతో పాటు ఆ రోజు మార్కెట్‌కు బంగారాన్ని కొని మిగిలిన డబ్బును తక్షణమే ఇచ్చేస్తారు.
ఈ విషయమై వాల్యూ గోల్డ్ సీఈఓ శ్రీ భరద్వాజ్ పంపత్వార్ మాట్లాడుతూ.. ‘మా సేవలను ముందుగా వరంగల్‌కు ఆ తర్వాత మహమూబాబాద్‌కు విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. పారదర్శకంగా బంగారు కొనుగోలు చేయడం మా లక్ష్యం. ప్రజలు ఈ మొబైల్ ఆఫీసులో తమ బంగారు నగల స్వచ్ఛత పరీక్షను ఉచితంగా చేయించుకోవచ్చు. మా బంగారం కొనుగోలు ప్రక్రియ అంతా ఆటోమెటెడ్‌గా ఉంఉది. ఇందుకోసం అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నాము. కరీంనగర్‌లో ఈ మైబైల్ ఆఫీస్ విజయవంతం కావడంతో వరంగల్‌లో ప్రారంభిస్తున్నాము. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఈ సేవలను విస్తరించడమే మా లక్ష్యం. ఈ వాహనంలో మంచి నాణ్యతతో కూడిన బంగారం, వెండి నాణేలను విక్రయిస్తాం’ అని చెప్పుకొచ్చారు.
వాహనం ఎక్కడికి వస్తుందంటే..
కాగా ఈ మొబైల్ వాహనం ఈనెల 21వ తేదీన వరంగల్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం 22వ తేదీ నుంచి 30 తేదీ వరకు కేఆర్ గార్డెన్‌లో వాహనం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందుబాటులో ఉండనుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.