Varsha Rutuvu Geyam
కరి మబ్బులు కరిగి కరిగి
ఊరూవాడ నీటి తోటి
పొంగి పొరలి పారింది!
శ్రావణము, భాద్రపదం
వర్ష ఋతువు వచ్చింది.
పండిన ఆ బీడులను
తడిసి ముద్ద చేసింది!
చెరువులన్ని నిండాయి
రైతు కలలు పండాయి
ఎదుగుతున్న పంటకు
తగు నీటిని కూర్చాయి!
గట్టునున్న మొక్కలన్నీ
కొత్త కొత్త కొమ్మ లేసి .
ప్రతి కొమ్మా పూలు పూసి
కాయలెన్నొ కాసాయి!
పట్టణాల్లో తాగునీరు
పల్లెలలో సాగునీరు
ప్రతి వారికి చేరింది
జలం కొరత తీరింది!
ఎండయినా వానయినా
సమయానికి రావాలి
అతివృష్టి అనావృష్టి
రైతు నొదిలి పోవాలి!
-కూచిమంచి నాగేంద్ర
91821 27880
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.