Wayanad Landslides : వరద భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లి ఓ కుటుంబం కొండచరియల కింద నలిగిపోగా.. అదే భయం ఓ కుటుంబం నిండు ప్రాణాలు కాపాడింది. కేరళ (Kerala)లోని వయనాడ్‌లో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులో (Wayanad Landslides) వెలుగుచూస్తున్న ఇలాంటి మానవీయ కథనాలు ఎందరో మనసుల్ని మెలిపెడుతున్నాయి.
Wayanad Landslides బంధువుల ఇంటికెళ్లి..
వయనాడ్ జిల్లాలోని చూరాల్‌మలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించే అవకాశం ఉందని ఈ ప్రాంతంలోని ఓ కుటుంబం భయపడింది. విపత్తు నుంచి తప్పించుకునేందుకు సోమవారం ముండక్కై సమీపంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. కానీ మృత్యువు వీరిని వదల్లేదు. కొండచరియల రూపంలో బలితీసుకుంది. ముండక్కై వద్ద మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఈ కుటుంబంలోని మొత్తం 11 మంది చిక్కుకుపోయారు. వీరిలో రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి వెలికి తీశారు. మిగతా 8 మంది ఎక్కడున్నారో ఇంకా ఆచూకీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
కుటుంబాన్ని కాపాడిన ఆమె ఆందోళన..
Wayanad Landslides ఇక, ముండక్కై గ్రామానికి చెందిన మహమ్మద్ అలీస్ కుటుంబం త్రుటిలో ఈ పెను విపత్తు నుంచి బయటపడింది. వర్షాల కారణంగా విపత్తును ముందే ఊహించిన అలీస్ భార్య షకీరా అక్కడి నుంచి వెళ్లిపోదామని పట్టుబట్టింది. తొలుత కుటుంబసభ్యులెవరూ ఆమె మాటలు పట్టించుకోలేదు. కానీ, తీవ్రంగా ఒత్తిడి చేయడంతో సోమవారం రాత్రి 16 కిలోమీటర్ల దూరంలోని మెప్పడికి వెళ్లి అక్కడ ఓ సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారు.
వారు వెళ్లిన కొన్ని గంటల తర్వాత ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్క అలీస్ నివాసం మినహా వీరి చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లు కూలిపోయాయి. ప్రస్తుతం తమ ఇళ్లు శిథిలాలు, బురదలో కూరుకుపోయిందని, తన భార్య ఆందోళనే తమ కుటుంబం ప్రాణాలు కాపాడిందని అలీస్ తెలిపారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.