వాట్సాప్లో త్వరలో సరికొత్త ఫీచర్ రానుంది. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మల్టీమీడియా మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ద్వారా రెండు ఫోన్ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేని ఫీచర్ వస్తోంది. మీరు మీ వాట్సాప్ ద్వారా నేరుగా అతిపెద్ద ఫైల్‌లను కూడా బదిలీ చేసుకోవచ్చు.
వాట్సాప్లో రాబోయే ఫీచర్ గురించి సమాచారం WABetaInfo ద్వారా అందించబడింది. ఇది వాట్సాప్ యొక్క రాబోయే ఫీచర్లను ట్రాక్ చేస్తుంది. ఇది ఆపిల్ (Apple) యొక్క (AirDrop).. గూగుల్ (Google) యొక్క నియర్ బై షేర్ (Nearby Share) పని మాదిరిగానే పని చేస్తుంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. వీడియోలు, ఫోటోలు.. ఇతర ఫైల్‌లను ఒక పరికరం నుండి మరొక పరికరంతో షేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు వస్తుందని.. ఆ తర్వాత ఐఓఎస్‌కు విడుదల చేస్తామని చెబుతున్నారు. ఫైల్‌ను షేర్ చేయడానికి.. స్కానర్ అందుబాటులో ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత రెండు ఫోన్‌లు ఒకదానితో ఒకటి జత చేయబడతాయి. గొప్ప విషయం ఏమిటంటే దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.