AP TET 2024 Exam Date : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెట్ పరీక్షకు ఏకంగా 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు దరఖాస్తుల వివరాలను వెల్లడించింది. సోషల్ స్టడీస్ పేపర్‌కు సంబంధించి 70,767 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 2- బి విభాగంలో 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈసారి మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో పోటీపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
AP TET 2024 Exam Date
టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని.. పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి త్వరలో విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ మరోసారి టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించి ఈ ఏడాది జులై 2వ తేదీన టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అలాగే పరీక్షల సన్నద్ధతకు కూడా మరింత సమయం ఇచ్చింది. దాదాపు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ మేరకు టెట్ షెడ్యూల్‌లో పలు మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ తేదీలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు ఈసారి భారీగా పోటీపడుతున్నారు. టెట్ హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.