Big Rain Alert in Telugu States దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. గత నెల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మహరాష్ట్ర, గుజరాత్, అస్సాం, తెలుగు రాష్ట్రాలతో పాటు కేళాలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా డ్యాములు, చెరువులు నిండి పొంగిపొర్లుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెరువులకు, కాల్వలకు గండ్లు పడి గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు నుంచి మరో మూడు రోజులు పలు జిల్లాల్లో భారీవర్షాలు పడే సూచన ఉందని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
Big Rain Alert in Telugu States
తెలుగు రాష్ట్రాల్లో ఒకటీ రెండు రోజులు తప్ప వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజలు నుంచి ఎడతేరిపి లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. జలాశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వరుసగా పడుతున్న వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారుల తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Big Rain Alert in Telugu States పశ్చిమ భారత్ లో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలోనూ తుఫాన్ సుడి ఏర్పడిందని.. దీని ప్రభావంతో మూడు రోజుల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఏపీలో రుతుపవనాల ప్రభావం గట్టిగానే ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్, అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు, మత్స్యాకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.