Cheating Partners ప్రేమ, పెళ్లి ఈ రెండూ చాలా పవిత్రమైనవి. అయితే లవ్ పార్టనర్ ని, లైఫ్ పార్టనర్ ని మోసం చేయడం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది ప్రస్తుత రోజుల్లో. అయితే ఎక్కువగా ఎవరు మోసం చేస్తున్నారు? అబ్బాయిలా? లేక అమ్మాయిలా? ఇది చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అసలు దీని గురించి స్టడీస్ ఏం చెప్తున్నాయి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
Cheating Partners
ఒక స్టడీ ప్రకారం 20 శాతం మంది మగవారు, 13 శాతం మంది పెళ్ళైన మహిళలు ఇతరులతో సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. సగటున 16 శాతం మంది మోసం చేస్తున్నట్లు ఈ స్టడీలో తేలింది. అయితే ఈ స్టడీ ప్రకారం మగవాళ్లే ఎక్కువగా మోసం చేస్తున్నట్లు తేలింది. మరొక స్టడీ ప్రకారం.. 9 శాతం మంది మహిళలు, 17 శాతం మంది మగవారు తమ భాగస్వాములకి నమ్మకద్రోహం చేశారని తేలింది. ఇందులో మరలా ఇతరులతో సంబంధం పెట్టుకున్న వారిని లిస్ట్ అవుట్ చేస్తే 15 శాతం మంది మహిళలు, 27 శాతం మంది మగవారు శారీరక సంబంధాలు పెట్టుకున్నారని తేలింది. సగటున 21 శాతం మంది మోసం చేస్తున్నారు. ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ 2010 నుంచి 2016 వరకూ వివిధ వయసు వారి మీద చేసిన జనరల్ సోషల్ సర్వే ప్రకారం.. అన్ని వయసు మగవారు తమ భాగస్వాముల్ని మోసం చేస్తున్నట్లు తేలింది. అయితే 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న అబ్బాయిలు నిజాయితీపరులని తేలింది. ఇక మహిళల్లో 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న వారు తమ భర్తలను మోసం చేసినట్లు తేలింది. ఇది సగటున 16 శాతంగా ఉంది. మహిళలతో పోలిస్తే భార్యలను మోసం చేసే మగవారు 26 శాతం మంది ఉన్నారు. మగవారిలో 70 నుంచి 79 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా భార్యలను మోసం చేస్తున్నారని తేలింది.
ఈ వయసు అమ్మాయిలే ఎక్కువగా మోసం చేస్తున్నారు:
18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మోసం చేసే అమ్మాయిలు 11 శాతం ఉండగా అబ్బాయిలు మాత్రం 10 శాతం మందే ఉన్నారు. దీన్ని బట్టి 18 నుంచి 29 ఏళ్ల వయసున్న అమ్మాయిలే ఎక్కువగా అబ్బాయిలను మోసం చేస్తున్నట్లు జనరల్ సోషల్ సర్వేలో తేలింది. 30 నుంచి 39 ఏళ్ల వయసున్న వారిలో 12 శాతం మంది అమ్మాయిలు మోసం చేస్తుండగా, 14 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 40 నుంచి 49 ఏళ్ల వయసు వారిని తీసుకుంటే 14 శాతం మంది మహిళలు , 16 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 50 నుంచి 59 వయసున్న వారిలో 15 శాతం మంది మహిళలు, 22 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 60 నుంచి 69 ఏళ్ల వయసు వారిలో 16 శాతం మంది మహిళలు, 24 శాతం మంది పురుషులు మోసం చేస్తున్నారు.
Cheating Partners 70 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో 13 శాతం మంది మహిళలు భర్తలను మోసం చేస్తుండగా.. 26 శాతం మంది పురుషులు భార్యలను మోసం చేస్తున్నారు. 80+ వయసున్న వారిలో 6 శాతం మంది మహిళలు మోసం చేస్తుండగా.. 24 శాతం మంది మగవారు భార్యలను మోసం చేసినట్లు తేలింది. ఇండియా విషయానికొస్తే.. 2023లో పలు గణాంకాల ప్రకారం.. ప్రేమించిన లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా పరాయి వారితో శారీరక సంబంధం పెట్టుకున్నవారిలో 23 శాతం మంది పురుషులు ఉండగా.. 13 శాతం మంది మహిళలు ఉన్నారు. 95 వేల మంది మీద చేసిన సర్వేలో 91 శాతం మంది మహిళలు, 77 శాతం మంది మగవారు వేరే వ్యక్తులతో భావోద్వేగ, శారీరక సంబంధం పెట్టుకున్నారని ఒక సర్వేలో తేలింది. మరొక స్టడీ ప్రకారం.. 10 మంది భారతీయ స్త్రీలలో 7 మంది విసుగు చెంది భర్తలను మోసం చేస్తున్నారని ఒక స్టడీలో తేలింది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.