Collector Visit to ZP High School గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ గత కొంతకాలంగా క్షేత్రస్థాయి పర్యటలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాఠశాలలు, వైద్యశాలల్లో తనిఖీలు చేస్తూ వాస్తవ పరిస్థితిలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఆమెకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
Collector Visit to ZP High School
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తనిఖీ చేస్తున్న సమయంలో పాఠశాలలో మొత్తం నాలుగు వందల మంది విద్యార్ధులున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. అయితే హాజరైంది మాత్రం మూడు వందల యాభై మంది మాత్రమే. ఒకే రోజు యాభై మందికి పైగా విద్యార్దులు అబ్సెంట్ అవ్వడంపై ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్ నిలదీశారు. వర్షం కారణంగా విద్యార్ధుల హాజరు శాతం తగ్గిందని చెప్పడంతో కలెక్టర్ మరింత అవాక్కయ్యారు.
విద్యార్దుల హాజరు తర్వాత ఉపాధ్యాయుల సంగతి ఏంటని ఆరా తీశారు. అయితే ముప్పై మంది టీచర్లు స్కూల్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. నాలుగు వందల మంది విద్యార్ధులకు ముప్పై మందా అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెయ్యి మంది విద్యార్ధులుంటున్న బడుల్లో కూడా ముప్పై మంది టీచర్లే ఉండటాన్ని చూస్తున్నాం. మరి మీ దగ్గర అంత తక్కువ సంఖ్యలో విద్యార్ధులుండటానికి కారణమేంటని నిలదీశారు. అంతేకాదు విద్యార్ధుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలేంటని అడిగారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సమాధానం చెప్పలేకపోయారు.
Collector Visit to ZP High School ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండటం లేదన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువుగా ఉంటే మరికొన్ని చోట్ల తక్కువుగా ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిపి విద్యార్దులు ఉపాధ్యాయులు శాతం సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు వాస్తవాలపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.