Dog Attack : గ్రామాలు, పట్టణాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గుంపులుగా వీధుల్లో తిరుగుతూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎక్కువగా దాడి చేసి తీవ్రంగా గాయపడుతున్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో బుధవారం రాత్రి నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటన ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది. గ్రామంలో పిట్ల రాజ్యలక్ష్మి ఒంటరిగా జీవిస్తోంది. రాత్రి భోజనం చేసి తన పూరిపాకలో మంచం మీద పడుకుంది. అర్ధరాత్రి కుక్కలు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి రాజ్యలక్ష్మిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. రాజ్యలక్ష్మి గట్టిగా కేకలు వేసిన రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. కుక్కల దాడిలో లక్ష్మి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మి మృతదేహాన్ని చూసి.. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామస్తులు వణికిపోతున్నారు. వీధికుక్కలు ఇంట్లోకే చొరపడి దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Dog Attack
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కాలనీలో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల అశ్విత, ఏడాదిలోపు చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన ఇద్దరిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏడాదికి ఒక్కసారైనా కుక్కలను పట్టుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి అధికారులు హడావుడి చేస్తున్నారని, వాటిని అడ్డుకునేది లేదని వాపోయారు. ఆసిఫాబాద్ జిల్లా ఖగజ్ నగర్ పట్టణంలోని సర్సిల్క్ కాలనీ, తైబానగర్, అశోక్ కాలనీ, ఓల్డ్ కాలనీ, ఇందిరా మార్కెట్ కాలనీల్లో రెండు రోజుల్లో 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.