EPF Personal Details Edit Option ఈపీఎఫ్ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌వో స్వల్ప మార్పులు చేసింది.
EPF Personal Details Edit Option
పేరులో మూడక్షరాలు దాటితేనే పెద్ద మార్పుగా పరిగణన
లావాదేవీలు నిర్వహించని ఖాతాల క్లెయిమ్‌లపై కొత్త విధివిధానాలు
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌వో స్వల్ప మార్పులు చేసింది. ఖాతాదారు, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి పేర్లలో తప్పులు దొర్లితే జాయింట్ డిక్లరేషన్ల ద్వారా సవరణలకు అవకాశం కల్పించింది. పేరులో రెండు అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో ‘పెద్ద(మేజర్) మార్పు’గా పరిగణించేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 3 అక్షరాలకు కుదించారు. స్పెల్లింగ్ పరంగా చేయాల్సిన మార్పులకు, పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని తొలగించింది. చేయాల్సిన మార్పులు మూడక్షరాలకు తక్కువగా ఉన్నా.. వివాహం తరువాత జీవిత భాగస్వామి ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే పేర్కొంది.
లావాదేవీలు లేని ఖాతాలపై…
-
- ఏళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్ ఖాతాల్లో నుంచి నగదు ఉపసంహరణలో ఇబ్బందులతో పాటు మోసాల నివారణకు ఈ-కేవైసీ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఈపీఎఫ్‌వో తప్పనిసరి చేసింది.
-
- లావాదేవీలు లేని ఖాతాల్లో ఎక్కువ వాటికి యూనివర్సల్ అకౌంట్ నంబరు(యూఏఎన్) లేదు. ఈ తరహా కేసుల్లో ఖాతాదారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి లేదా ఈపీఎఫ్‌ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుని బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పోర్టల్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుంటే చాలు.. పీఎఫ్ సిబ్బందికి ఇంటికే వచ్చి యూఏఎన్‌ను సిద్ధం చేస్తారు.
-
- చందాదారుడి ఖాతాలో నగదు నిల్వ రూ.లక్ష కన్నా తక్కువగా ఉంటే సంబంధిత అకౌంట్స్ అధికారి(ఏవో), రూ.లక్ష కన్నా ఎక్కువగా ఉంటే సహాయ పీఎఫ్ కమిషనర్(ఏపీఎఫ్‌సీ) లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్(ఆర్‌పీఎఫ్‌సీ) నిర్ణయం తీసుకుంటారు. పనిచేసిన కంపెనీ మూతబడిన సందర్భాల్లో యూఏఎన్ లేనివారు పీఎఫ్ కార్యాలయాల్లో దాన్ని తీసుకోవాలి. చందాదారు చనిపోయినపుడు.. ఫారం-2లో పేర్కొన్న నామినీ పేరిట ఈ-కేవైసీ చేసి నగదు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశమివ్వవచ్చు. నామినీ పేరును పేర్కొనకుంటే.. చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ దాఖలు చేయవచ్చు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.