Foods for Eye Health కళ్లు సరిగ్గా కనిపిస్తేనే అన్నీ చూడగలం. సర్వేద్రియానాం నయనం అన్నారు పెద్దలు. శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కళ్లు కూడా ఒకటి. అందుకే కళ్లను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైనా ఆహారం తీసుకోవాలి. సాధారణంగా అందరూ విటమిన్ ఏ తీసుకుంటే.. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటారు. కానీ విటమిన్ ఏ ఒక్కటి సరిపోదు. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి మరిన్ని పోషకాలు కూడా కావాలి. కంటి చూపు సరిగ్గా లేక చాలా మంది కళ్లద్దాలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల ఆహారాలను సరైన పద్దతిలో తీసుకుంటే కళ్లద్దాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. మరి కళ్లను ఆరోగ్యంగా ఉంచాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Foods for Eye Health
గుడ్లు:
గుడ్లు తినడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా కళ్లకు కూడా చాలా మంది. ఇందులో లూటిన్, గ్జియాన్తీన్, విటమిన్ ఏ, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లు తినడం వల్ల వయసు రీత్యా వచ్చే కొన్ని రకాల కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచే కోడి గుడ్డు ఇవ్వడం అలవాటు చేయండి.
చేపలు:
చేపలు తినడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్.. కళ్లు చూపుకు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. కళ్లు పొడి బారకుండా కాపాడుతుంది. అంతే కాకుండా రెటీనా కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు చేపలు హెల్ప్ చేస్తాయి.
బంగాళదుంపలు:
బంగాళదుంపలు తినడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో బీటా కెరోటీన్, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కళ్లు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
క్యారెట్లు:
క్యారెట్లు ఆరోగ్యానికి, చర్మానికే కాకుండా కళ్లకు కూడా చాలా మంచిది. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి కళ్లు సరిగా కనిపించేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. క్యారెట్‌లో ఉండే బీటా కెరొటిన్, రెటీనా ఇతర కంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.