Godavari Pushkaralu రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. చేపట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి 16 మంది కీలక అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ తదితర శాఖల జిల్లా అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. రానున్న పుష్కరాలకు ఇప్పటి నుంచి చేపట్టాల్సిన పనులపై ఈ బృందం నివేదిక తయారు చేస్తుంది.
Godavari Pushkaralu
బృందం ఏం చేస్తుందంటే..
పుష్కరాలు జరిగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటిస్తారు. ఘాట్ల పటిష్టత, విస్తరణ, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. గత పుష్కరాలకు ఒక్క రాజమహేంద్రవరానికే కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చారు. ఈసారి అంతకు రెండు రెట్లకు మించి వస్తారని అంచనా. ఇప్పటికే ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహణ, పనులపై మున్సిపల్ మంత్రితో కలిసి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
గంగా పుష్కరాల అధ్యయనం
గోదావరి పుష్కరాల కంటే ఏడాది ముందు గంగానది పుష్కరాలు జరుగుతాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర పురపాలిక విభాగం అమలు చేస్తున్న విధానాలపై నివేదికను అనుసరించాలని నిర్ణయించారు. నిధుల విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో స్పందించే అవకాశం ఉంది. పుష్కరాలకు పనులు సక్రమంగా జరగాలంటే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి పరిపాలన విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా ఎన్నికలు క్రతువు పూర్తి చేయాలని చూస్తున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.