IND vs SL టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రెడీ అయింది టీమిండియా. ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన జోష్‌లో టీమిండియా ఉంటే.. టీ20 సిరీస్‌లో ఎదురైన ఓటమికి వన్డే సిరీస్‌లో బదులు తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. సొంత గడ్డపై వన్డే సిరీస్‌లో శ్రీలంక టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి లంకతో తొలి వన్డలో భారత జట్టు ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
IND vs SL
టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు.. వన్డే, టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీల్లో కనిపించనున్నారు. టీ20 ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత.. తొలిసారి కోహ్లీ, రోహిత్ గ్రౌండ్‌లోకి దిగబోతుండటంతో భారత క్రికెట్ అభిమానులు కూడా ఈ సిరీస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిద్దరు రావడంతో భారత వన్డే జట్టు సూపర్ స్ట్రాంగ్‌గా మారింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా టీమ్‌లోకి రావడంతో బ్యాటింగ్‌లో డెప్త్ పెరిగింది.
IND vs SL మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ యూనిట్ కూడా సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇక ఆల్‌రౌండర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర ఉండటం అదనపు బలం. మొత్తంగా.. ఒక బెస్ట్ టీమ్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మరో వైపు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సొంత గడ్డపై వాళ్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. టీ20 సిరీస్‌లో ఓడిపోయినంత మాత్రానా.. వన్డే సిరీస్‌లోనూ లంకను లైట్ తీసుకుంటే.. ఎదురుదెబ్బ తగిలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
భారత ప్లేయింగ్ ఎలెవన్(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, అర్షదీప్ సింగ్, కుల్దీప్, ఖలీల్ అహ్మద్.
Inching closer to ODI 1⃣ ⌛️#TeamIndia | #SLvIND pic.twitter.com/XqQsU6AbEa
— BCCI (@BCCI) July 31, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.