IND vs SL : టీమ్ఇండియాతో జరిగిన టీ20 సిరీస్‌తోను 3-0 తేడాతో ఓడిపోయిన శ్రీలంక, కనీసం వన్డే సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. అయితే.. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్లు దిల్షాన్ మధుశంక, మతీషా పతిరణ గాయాలతో వన్డే సిరీస్‌కు దూరం అయినట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. జట్టు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో మధుశంక ఎడమ కాలికి గాయమైంది.
IND vs SL
మరో వైపు భారత్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో పతిరాన భుజానికి గాయమైంది. వైద్యులు అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరం అని సూచించారు. దీంతో భారత్‌తో వన్డే సిరీస్‌కు వీరిద్దరు దూరం అయినట్లుగా లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. వీరిద్దరి స్థానాల్లో ఎషాన్ మలింగ, మహ్మద్ షిరాజ్‌లకు తీసుకున్నట్లుగా తెలిపింది. స్టాండ్ బైలుగా కుశాల్ జనిత్, జెఫ్రీ వాండర్సే, ప్రమోద్ మధుషన్‌లను జట్టులోకి తీసుకుంది.
IND vs SL టీమ్ఇండియాతో లంక జట్టు మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ మూడు వన్డేలు కొలంబో వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు : చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్, అసిత ఫెర్నాండో.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.