Monkey Pox | ప్రపంచవాప్తంగా హడలెత్తిస్తున్న మంకీపాక్స్ ఏపీలోనూ కలకలం రేపింది. దుబాయ్నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇందుకోసం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. అందులో అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది.
సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఈ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్వెంకటేష్తెలిపారు. అన్ని రకాల ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. ఇదిలావుంటే డబ్యూహెచ్వోహెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.
అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసి విదేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఇందుకోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. తాము పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.