Muhurtham in August ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి, గురు మూఢమి రావడంతో వివాహాది శుభకార్యాలకు అవాంతరం ఏర్పడిన విషయం తెలిసిందే. మూడు నెలలు నుంచి ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. నిన్నటితో ఆషాఢ మాసం ముగిసింది.. నేటి నుంచి సోమవారం (ఆగస్టు 5) శ్రావణ మాసం ప్రారంభంమై సెప్టెంబర్ 3 తో ముగియనుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఏదైనా మంచి పని చేయాలంటే ఖచ్చితంగా శుభ ముహూర్తం చూస్తుంటారు. శుభ ముహూర్తం లేకుంటే ఎలాంటి కార్యమైనా వాయిదా వేసుకుంటారే తప్ప దాన్ని నిర్వహించరు. గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు చేసుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ముఖ్యంగా ఆ రెండు రోజులు మరీ స్పెషల్ డే అంటున్నారు పురోహితులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Muhurtham in August
నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది.. మూడు నెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. ఆగస్టు 7 నుంచి 28 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. కానీ మూఢం కారణంగా ఎక్కడా పెళ్లి భాజాలు మోగలేదు. శ్రావణ మాసం మొదలైంది.. నిన్నటితో మూఢం ముగిసింది. ఆగస్టు నెలలో వరుసగా ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు పురోహితులు. ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 శుభ ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ నెల 17, 18 తేదీలో అద్భుతమైన శుభ ముహూర్తం ఉందని పురోహితులు పేర్కొన్నారు. మామూలు రోజుల కన్నా ఈ రెండు రోజుల్లో బలమైన ముహూర్తాలు అని అంటున్నారు. అందుకే ఈ రెండు రోజులు దేశ వ్యాప్తంగా వేలాది వివాహాలు జరగనున్నాయని చెబుతున్నారు.
మూడు నెలలుగా మంచి పెళ్లి ముహూర్తం కోసం ఎదురు చూసేవారికి ఇది గొప్ప శుభవార్త అంటున్నారు. పెళ్లి చేసుకునేవారు, గృహ ప్రవేశం, శంకుస్థాపన, వ్యాపారం ప్రారంభించానుకునే వారు ఈ శుభ మూహూర్తం ఫిక్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రావణ మాసం శుభముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పురోహితులు, కళ్యాణ మండపాలు, బాజా భజంత్రీలు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యూటీ పార్లర్లు, ఈవెంట్ల నిర్వహకులు, ప్రింట్ ప్రెస్, జ్యులరీ, వస్త్ర దుకాణాలు, పండ్లు, పూల, క్యాటరింగ్ వాళ్లు సంతోషంలో ఉన్నారు. మూడు నెలల వరకు ఖాళీగా ఉన్న వీరంతా త్వరలో బిజీ కానున్నారు.పెళ్లిళ్లు కానీ, వ్యాపారాలు, గృహ ప్రవేశాలు మీకు సంబంధించిన ఏ శుభ ముహూర్తాలైనా పండితులను సంప్రదించి మీకు అనువైన తేదీని ఎంచుకోవచ్చు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.