Neuralink Chip మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్‌ను అమర్చినట్లు న్యూరాలింక్ (Neuralink) సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
Neuralink Chip
రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్‌లో దాదాపు 400 ఎలక్ట్రోడ్‌లు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు మస్క్ (Elon Musk) వెల్లడించారు. అతడికి ఎప్పుడు సర్జరీ చేశారు సహా ఇతర వివరాలేవీ బహిర్గతం చేయలేదు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ ఏడాది చివరి వరకు మరో ఎనిమిది మందికి ఈ చిప్‌ను అమర్చనున్నట్లు మాత్రం మస్క్ ధ్రువీకరించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.
ఇదే కార్యక్రమంలో తొలి చిప్‌ను అందుకున్న వ్యక్తి నోలాండ్ అర్బాగ్‌తో పాటు న్యూరాలింక్‌కు (Neuralink) చెందిన ముగ్గురు ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు. చిప్‌ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్ర చికిత్సకు సంబంధించిన విషయాలను వివరించారు. చిప్ అమర్చడానికి ముందు ట్యాబ్లెట్‌ను ఆపరేట్ చేయడానికి నోట్లో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని అర్బాగ్ వివరించారు. ఇప్పుడు ఆ అవసరం రావడం లేదని తెలిపారు.
చిప్ అమర్చిన తొలినాళ్లలో అర్బాగ్ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలక్ట్రోడ్‌లలో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేశాయి. ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్ (Neuralink).. సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్‌ను ఆపరేట్ చేసే విషయంలో అర్బాగ్ రికార్డు నెలకొల్పారని మస్క్ తాజాగా వెల్లడించారు.
మానవ మెదడులో తొలి చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్ (Neuralink) ప్రకటించింది. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ (BCI) ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్’ వీడియో గేమ్‌ను ఆడింది.
ఎలా పనిచేస్తుందంటే..
న్యూరాలింక్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI)లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.