Paris Olympics Dhoni Inspiration పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు రెండు పతకాలు సాధించింది. ఆ రెండూ షూటింగ్‌లో వచ్చినవే. ఇప్పుడు షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుశాలె (Swapnil Kusale) ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు. ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత షూటర్‌గా రికార్డు సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం 1గంటకు ఫైనల్ జరగనుంది. భారత్‌కు పతక ఆశలు రేపుతున్న స్వప్నిల్ కుశాలె గురించి తెలుసుకుందాం.
Paris Olympics Dhoni Inspiration
29 ఏళ్ల స్వప్నిల్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి, సోదరుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తల్లి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్‌లలో పోటీపడుతున్నాడు. అయితే, కెరీర్ ఆరంభించిన 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ షూటర్ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే భారత తరఫున వివిధ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నాడు.
ధోనీని చూసి ప్రేరణ పొంది
క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని చూసి ప్రేరణ పొందానని స్వప్నిల్ చెప్పాడు. ధోనీ కూడా క్రికెటర్ కాకముందు రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. తర్వాత టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ధోనీ బయోపిక్‌ను చాలాసార్లు చూశానని, అతడిలా గొప్ప విజయాలు సాధించాలనుకుంటున్నట్లు స్వప్నిల్ చెప్పాడు.
Paris Olympics Dhoni Inspiration ‘‘షూటింగ్‌లో ప్రత్యేకంగా ఎవరినీ అనుసరించను. ఈ క్రీడాంశానికి సంబంధం లేని ధోనీని ఆరాధిస్తాను. అతని జీవితానికి నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది. నేను అతనిలాగే టికెట్ కలెక్టర్‌ని. అతను మైదానంలో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. షూటర్‌గా రాణించాలంటే ధోనీలా కూల్‌గా ఉండటం అవసరం. ప్రతి షాట్‌ను జాగ్రత్తగా పేల్చాలి. నేను ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. మ్యాచ్ మొత్తం ఇదే విధంగా ఉండేలా చూసుకుంటున్నా. మనస్సులో స్కోర్‌ల గురించి ఆలోచిస్తూ కాకుండా ఓపికగా, ప్రశాంతంగా ఉంటూ షూట్ చేయాలి. ఒలింపిక్స్‌లో ఇక్కడి వరకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. మను బాకర్ పతకం సాధించడం మా కాన్ఫిడెన్స్‌ని పెంచింది. మేం కూడా విజయం సాధిస్తామనే నమ్మకముంది’’ అని వెల్లడించాడు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.