- పుణే సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగం ఆరోపణలు
- యూపీఎస్సీ సెలెక్షన్ సమయంలోనూ తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణ
- భవిష్యత్తులో సివిల్స్ లో పాల్గొనకుండా పూజా ఖేద్కర్ పై నిషేధం
Pooja Khedkar Lifetime Ban వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సెలెక్షన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులో ఆమె సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పూణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
Pooja Khedkar Lifetime Ban
అంతకుముందు, సెలెక్షన్ సమయంలో యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. పూజా ఖేద్కర్ మీద వచ్చిన ఆరోపణలపై ఇటీవలే కేంద్రం నియమించిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసి, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి నివేదిక సమర్పించింది.
మహారాష్ట్రకు చెందిన వైభవ్ కోకట్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ తో పూజా ఖేద్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖరీదైన ఆడి కారుతో పూజా ఖేద్కర్ ఫొటోను వైభవ్ కోకట్ పోస్టు చేశారు. దాంతో అందరి దృష్టి ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పైకి మళ్లింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఆమె యూపీఎస్సీ సెలెక్షన్ కోసం చేసిన అక్రమాలు కూడా బయటపడ్డాయి.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.