Sarabh Jyoth Singh పారిస్ ఒలింపిక్స్‌లో (Olympic Games Paris 2024) భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటికే మూడు పతకాలు కైవసం చేసుకున్న భారత్.. మరిన్ని సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, మంగళవారం ‘ఇండియా హౌస్’లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మను, (Manu Bhakar) సరభ్‌జ్యోత్ సింగ్ (sarabjot Singh) జోడీ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి ఇండియా హౌస్‌కు వెళ్లిన ఈ జోడీకి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, పలువురు అభిమానులు స్వాగతం పలికారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాలు చేసుకున్నారు. అంతలో సౌరభ్ ‘దయ చేసి తినడానికి ఏమైనా ఇవ్వండి’ అని అడిగాడట. అంతే.. అక్కడున్న వారందరికీ నిమిషాల వ్యవధిలో పానీపూరీ, భేల్ పూరీ, దోసె సర్వ్ చేశారట.
Sarabh Jyoth Singh
ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు వివిధ ఆహార నియమాలు ఉంటాయి. మితాహారం తీసుకోవాలని, అది తినొద్దని, ఇది తినొద్దని కోచ్‌లు, సహాయ సిబ్బంది పదేపదే చెబుతుంటారు. దీంతో తినాలని మనసులో కోరిక ఉన్నా.. పతకం సాధించాలన్న లక్ష్యంతో వారంతా నోరు కట్టుకొని ఉంటారు. పతకం సొంతమైన తర్వాత నచ్చిన ఆహారం తినడానికి వారంతా ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారో చెప్పేందుకు ఈ సన్నివేశమే నిదర్శనం. అలాంటి వారందరికీ ‘ఇండియా హౌస్’ సొంత ఇంటిలా మారింది. గేమ్ పూర్తయిన తర్వాత అథ్లెట్లు ఇక్కడ తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచక్కా లాగించేయొచ్చు. పారిస్ ఒలిపింక్స్‌లో పోటీపడుతున్న భారత్ అథ్లెట్ల కోసం తొలిసారిగా ‘ఇండియా హౌస్’ను ఏర్పాటు చేశారు. అథ్లెట్లను సత్కరించడానికి, వారి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదో వేదిక. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని రకాల భారతీయ వంటకాలు ఉంటాయి.
మంగళవారం జరిగిన కంచు పోరులో మను, సరబ్‌జ్యోత్ సింగ్ జోడీ 16-10తో కొరియాకు చెందిన లీ వొనో, వో యె జిన్ జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.