School Holidays సెలవు అంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఇప్పటికే వేసవి సెలవులు పూర్తి చేసుకుని.. పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మన దగ్గర జూన్ నెల నుంచే స్కూల్స్ మొదలు కాగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం.. వేసవి వడగాల్పులు, ఎండ తీవ్రత కారణంగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభించారు. అయితే స్కూల్స్ ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలో విద్యాసంస్థలకు సెలవులు మంజూరు చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. మరి ఇంతకు ఈ సెలవులు ఎందుకు.. ఏ రోజున హాలీడే ఉంది అంటే..
School Holidays
School Holidays ఆగస్ట్ నెల ప్రారంభం అయ్యింది. ఈ నెలలో స్కూళ్లకు, కాలేజీలకు చాలా సెలవులు రానున్నాయి. సాధారణంగా ఆగస్టు నుంచి పండగలు మొదలవుతాయి. వీటికి తోడు రెండో శనివారం, ఆదివారాలు కలిసి.. విద్యార్థులకు భారీగా హాలీడేస్ రానున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలోనే విద్యార్థులకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 4 ఆదివారం, ఆగస్ట్ 10.. రెండో శనివారం, 11 రెండో ఆదివారం. వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాత వెంటనే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. ఈ రెండు రోజులు విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. అలానే ఆగస్టు 18 ఆదివారం, 19 రాఖీ పౌర్ణమి సందర్భంగా మరోసారి వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
అయితే ఆగస్టు 15, 16, 18, 19 సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17 ఒక్క రోజు హాలీడే తీసుకుంటే.. వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వస్తాయి. ఇకపోతే రాష్ట్రం లేదా ప్రాంతం ఆధారంగా సెలవుల్లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల హాలిడేస్ గురించి సంబంధిత స్కూల్ లేదా కాలేజ్ హాలిడే షెడ్యూల్ చెక్ చేసుకోవడం ఉత్తమం.
సెలవుల జాబితా
- ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం
- ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం
- ఆగస్టు 18 ఆదివారం
- ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి
ఇక పైన పేర్కొన్న సెలవులు ఉద్యోగులకు కూడా మాగ్జిమం వర్తించే అవకాశం ఉంది. కనుక ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని భావించే వారు.. ఈ సెలవులను వినియోగించుకుంటే చాలా మంచిది. మరి మీరు కూడా ట్రై చేయండి.