Solar Car for Taxi Drivers వేవ్ మొబిలిటీ కంపెనీ రెండు రకాల సోలార్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. 3 సీటర్ ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారుని, అలానే 5 సీటర్ సీటీ5 సోలార్ కారుని తీసుకొస్తుంది. ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారు గురించి ఇది వరకే చెప్పి ఉన్నాం. పూణేకి చెందిన వేవ్ మొబిలిటీ కంపెనీ సీటీ5 సోలార్ ఎలక్ట్రిక్ సిటీ ట్యాక్సీని తయారు చేస్తుంది. ఇది సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. ట్యాక్సీ డ్రైవర్స్ కోసం ప్రత్యేకంగా ఈ కమర్షియల్ వాహనాన్ని తయారు చేసింది. భారత్ లో తొలిసారిగా ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేయబడిన సోలార్ ఎలక్ట్రిక్ కారు ఇదే. ఇది సోలార్ మీద, కరెంట్ మీద రెండిటి మీద నడుస్తుంది. కారు పైన సోలార్ ప్యానెల్ ఇచ్చారు. దీని వల్ల ఛార్జింగ్ అవుతుంది. ఇది ఫుల్ ఛార్జ్ తో 330 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది 5 మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. బూట్ స్పేస్ 400 లీటర్లు ఇచ్చారు. సీసీఎస్2 ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.
Solar Car for Taxi Drivers
ఈ కారు బ్యాటరీ మీద మూడేళ్లు లేదా లక్ష 50 వేల కిలోమీటర్లు వారంటీ ఇస్తుంది కంపెనీ. రోబస్ట్ స్టీల్ రోల్ కేజ్ మెటీరియల్ తో తయారు చేశారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. కారులో ఉన్న ఐదు సీట్లకు ఐదు సీటు బెల్ట్స్ ఇచ్చారు. స్పీడ్ లిమిట్ వచ్చేసి 70 కి.మీ.గా ఉంది. రిమోట్ ఫ్లీట్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు కారు హెల్త్ ని చూసుకోవచ్చు. ఏడాదికి 4 వేల కిలోమీటర్లు సోలార్ పవర్ తో ఉచితంగా జర్నీ చేయవచ్చు. ఈ కారుకున్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ కారు వెనుక భాగం మీద డిజిటల్ ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. అది కూడా లొకేషన్ బట్టి మారేలా దీన్ని డిజైన్ చేశారు. అంటే ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఎక్కడ ఏ యాడ్ ప్లే అవ్వాలనేది డిసైడ్ చేసుకునేలా ఇందులో ఒక ఫీచర్ ఇచ్చారు. దీని వల్ల ఇలా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. వేల్యూ యాడెడ్ ఫీచర్స్ కారణంగా ఈ కారు మీద పెట్టిన పెట్టుబడి వెంటనే వచ్చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, ఏసీ, రేర్ ఏసీ వెంట్, ఎల్ఈడీ క్యాబిన్ లైట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎల్ఈడీ బ్రేక్ లైట్ వంటివి ఇచ్చారు. సీట్లను ఈజీగా క్లీన్ చేసుకునేలా వీటిని అపోస్టరీ మెటీరియల్ తో డిజైన్ చేశారు.
Solar Car for Taxi Drivers ఇది లైట్, ఎస్టీడీ, ప్లస్ మూడు వేరియంట్లలో వస్తుంది. లైట్ వేరియంట్ 215 కి.మీ. రేంజ్ ఇవ్వగా, ఎస్టీడీ వేరియంట్ రూ. 260 కి.మీ., ప్లస్ వేరియంట్ లో రూ. 330 కి.మీ. రేంజ్ ఇస్తుంది. లైట్ వేరియంట్ లో 17 కిలో వాట్ బ్యాటరీ ఇవ్వగా.. ఎస్టీడీ వేరియంట్ లో 21 కిలో గేట్ బ్యాటరీ ఇచ్చారు. ప్లస్ వేరియంట్ లో 26 కిలో వాట్ బ్యాటరీ ఇచ్చారు. ఏసీ ఛార్జింగ్ విషయానికొస్తే.. లైట్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు, ఎస్టీడీ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 6.5 గంటలు, ప్లస్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 8 గంటల సమయం పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికొస్తే.. ఎస్టీడీ వేరియంట్ 35 నిమిషాల్లో, ప్లస్ వేరియంట్ 45 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఇక ఈ కమర్షియల్ వెహికల్ ని 2025లో లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు ఇవా సోలార్ కారుని కూడా 2025లోనే తీసుకొస్తుంది. ఈ కారుని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. ఇక ధర విషయానికొస్తే.. వేరియంట్ ని బట్టి 6 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. ఈ బడ్జెట్ లో ట్యాక్సీ డ్రైవర్లకు ఈ కమర్షియల్ కారు అందుబాటులోకి తీసుకొస్తే నిజంగా వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.