Street Dogs Saved Life భూ వివాదంలో నలుగురు వ్యక్తులు తనను సజీవంగా పూడ్చిపెట్టారని, అనంతరం వీధికుక్కలు మట్టిని తొవ్వడంతో తాను బతికి బయటపడ్డానని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Street Dogs Saved Life
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 18న ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో అతడిపై అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడి చేశారు. రూప్ కిశోర్ మృతి చెందాడని భావించి నిందితులు ఓ పొలంలో అతడిని పాతిపెట్టి వెళ్లిపోయారు.
అదే సమయంలో అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తొవ్వాయి. రూప్ కిశోర్ శరీరాన్ని కొరికాయి. దీంతో రూప్ కిశోర్‌కి తిరిగి స్పృహ వచ్చింది. దీంతో అతడు నడుచుకుంటూ స్థానికుల వద్దకు వెళ్లడంలో అతడిని వారు ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై రూప్ కిశోర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని అన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.