Sukanya Samriddhi Yojana ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం అప్పుడే పుట్టిన పిల్లల నుండి 10 సంవత్సరాల్లోపు ఉన్న ఆడపిల్లలకు, ప్రతి నెల రూ.250 నుండి ఆపై ఎంతైనా జమ చేస్తే , దాన్నిబట్టి మనకు 15 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నకిరేకల్ సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్ లోకల్ 18 ద్వారా తెలియజేశాడు.
వివరాల్లోకెళ్తే… సూర్యాపేట డివిజన్ నకిరేకల్ సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుండి పది సంవత్సరాలు లోపు ఆడపిల్ల ఈ పథకానికి అర్హులు అయితారు.
అలాగే వారు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. దీనితో పాటు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అకౌంట్ ఫామ్ నింపి అకౌంట్ ఓపెన్ చేయాలి. వీటితోపాటు తల్లి గాని తండ్రి గాని పాన్ కార్డు ఆధార్ కార్డు కూడా జమ చేయాలి. సుకన్య సమృద్ధి యోజన ప్రతి నెల పొదుపు రూ .250 నుండి మొదలవుతుంది.
ఒక సంవత్సరం లోపు లక్షన్నర వరకు కుటుంబ శక్తి మేరకు పొదుపు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా వడ్డీ కల్పిస్తుంది ఈ పథకానికి. ఈ యొక్క పథకం అనేది దాదాపు 15 సంవత్సరాలు కట్టాలి. ఆ తర్వాత పై చదువుల కోసం ఎడ్యుకేషన్ లోను కూడా తీసుకోవచ్చు. ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు కడితే అవి రూ.1,80,000 అవుతాయి.
భారత ప్రభుత్వం వడ్డీతో కలుపుకొని రూ .5 లక్షల 50 వేలు ఇవ్వడం జరుగుతుంది. ఆడపిల్ల పుట్టడం భారమే కాదు అదృష్టం కూడా ఇప్పుడు భావించవచ్చు, ఇట్లాంటి కేంద్ర పథకాలు ఆడపిల్లలున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ వినియోగించుకోవాలని లోకల్ 18 ద్వారా తెలియజేశారు.