- 2017లో హైదరాబాద్ లో చిన్నారిపై హత్యాచారం
- ఓ సెంట్రింగ్ కూలీ ఘాతుకం
- మరణశిక్ష విధించిన సెషన్స్ కోర్టు
- తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసిన వైనం
- పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు
Telangana High Court : అతడికి మరణశిక్షే సరైనది… తెలంగాణ హైకోర్టు తీర్పు హైదరాబాదులోని నార్సింగిలో ఐదేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్షే సరైనదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు దోషికి కింది కోర్టు విధించిన మరణశిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది.
Telangana High Court
2017లో మధ్యప్రదేశ్ కు చెందిన దినేశ్ కుమార్ ధర్నే అనే వలస కూలీ హైదరాబాదులో ఒక చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఆ చిన్నారిని కిడ్నాప్ చేశాడు. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం, ఆ విషయం తల్లిదండ్రులకు చెబుతుందేమోనని భయపడి ఆ పాపను హత్య చేశాడు. ఆ పాప తల్లిదండ్రులు బీహార్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు.
ఈ కేసు విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు దినేశ్ కుమార్ కు 2021లో ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును దినేశ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే తెలంగాణ హైకోర్టు అతడి విజ్ఞప్తిని తోసిపుచ్చి, మరణశిక్షను ఖరారు చేసింది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.