Toe Rings Reason పెళ్లి రోజున వరుడు లేదా మేన మామ నవ వధువు కాలి వేలుకి మెట్టెలు పెట్టడం ప్రాచీన సంప్రదాయం. ఇలా మెట్టేలను ధరించే సాంప్రదాయం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Toe Rings Reason
ఒక అమ్మాయికి పెళ్లి అయ్యింది అంటే కాలికి మెట్టెలు ఉన్నాయా అని చూస్తారు. ఇలా పెళ్లయిన స్త్రీలు మెట్టెలు ధరించడం వెనుక ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఇది కొందరికి అతిశయోక్తిలా అనిపించవచ్చు. చాలా మంది ఈ నమ్మకాన్ని నమ్మకపోవచ్చు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
సాధారణంగా పాదం బొటన వేలు పక్కన్న ఉన్న వేలికి అంటే రెండవ కాలి వేలుకి మెట్టేలను ధరిస్తారు. ఎందుకంటే రెండవ వేలు నుండి ఒక నిర్దిష్ట నాడి గర్భాశయానికి అనుసంధానించబడి గుండె గుండా వెళుతుంది.
ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడం ద్వారా గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రుతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
రెండో కాలివేలుకి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయం బలపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది మాతృత్వం సమయంలో స్త్రీకి సహాయపడుతుంది.
అంతేకాదు వెండి మంచి లోహం. కాలికి పెట్టుకున్న వెండి మెట్టెలు భూమి నుండి సౌర శక్తిని గ్రహిస్తుంది. శరీరానికి వ్యాపిస్తుంది. కనుక వివాహమైన స్త్రీ కాలికి మెట్టెలు పెట్టుకోవడం మంచిదని చెబుతారు.
వెండి ధరిస్తే శరీరం చల్లగా ఉంటుంది. అందుకే వెండి మెట్టెలనే పెట్టుకోవాలి. అంతేకాదు బంగారం, వంటి ఇతర లోహాలతో తయారు చేసిన మెట్టెలను మాత్రం పెట్టుకోవద్దు. ఇలా చేయడం వలన
నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.