Vitamin B12 Foods : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన సూక్ష్మ పోషకాలు అత్యంత అవసరం. విటమిన్స్, మినరల్స్ తో పాటు కొవ్వు పదార్థాలు శరీరానికి తగినంత తీసుకోవాలి. శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలలో ఒకటి విటమిన్ బి12. దీనిని కోబాలమైన్ అని కూడా అంటారు.
ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత నుంచి మతిమరపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి 12 ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి 12 గురించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం: మాంసాహారంలో అధికంగా విటమిన్ బి 12 ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొవ్వు శాతం అధికంగా ఉండే మాంసాహారం ఎంచుకోవడం మంచిది. వారానికి కొన్ని సార్లు మాంసాహారం తినడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో విటమిన్ బి 12 కంటెంట్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చేపలు: విటమిన్ బి 12 అధికంగా ఉండే మరో పోషకాహారం చేపలు. ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్ వంటి చేపల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. సాల్మన్ చేపల్లో గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి శరీరానికి తగినంత పోషకాలను తీసుకోవడం అవసరం.
పాల ఉత్పత్తులు: కొందరు నాన్ వెజ్ తిననివారు కూడా ఉంటారు. అలాంటి వారికి శరీరానికి తగినంత ప్రోటీన్ లభించదు. ముఖ్యంగా వెజిటేరియన్స్ పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జున్ను, పెరుగు, పాల వంటి వాటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పాల ఉత్పత్తులు చేర్చుకోవడం మంచిది. దీని వల్ల విటమిన్ బి 12 లోపం తలెత్తకుండా ఉంటుంది.
గుడ్లు: విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహారంలో గుడ్లు కూడా ఒకటి. గుడ్లలోని పచ్చసొనలో ఇది ఎక్కువగా ఉంటుంది. గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెండు గుడ్ల నుంచి ఒకటి 1.1 మైక్రోగ్రాముల విటమిన్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
తృణధాన్యాలు: తృణధాన్యాలు బలవర్ధకమైన పోషకాహారాలు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తిననివారు విటమిన్ సి అధికంగా ఉండే పోషకాహారం తినాలి. ఆహారంలో భాగంగా తృణధాన్యాలు తీసుకోవాలి. తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్, తీసుకోవడం కూడా బెటర్.
సోయా పనీర్: సోయాతో చేసే పదార్థాల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. దీనిని బీన్ పెరుగు అని కూడా పిలుస్తారు. చపాతి, అన్నంలోకి ఇది రుచిగా ఉంటుంది. నూనెలో వేయించి సలాడ్ లాగా కూడా కలిపి తీసుకోవచ్చు