We want OPS కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో (యూనిఫైడ్ పెన్షన్ స్కీం) యుపిఎస్ అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అదనంగా వనగూరే ప్రయోజనం ఏమీ లేదని, కావున పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని, వేరొక దాన్ని అంగీకరించేది లేదని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
We want OPS
ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన యుటిఎఫ్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన జిల్లా స్వర్ణోత్సవాలకు సంబంధించి తన గోడ పత్రికను ఉపాధ్యాయ సంఘాలకు నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగి ఎలాంటి కంట్రిబ్యూషన్ చెల్లించకుండా ఇచ్చే పాత పెన్షన్‌ను పునరుద్ధరించకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ప్రయత్నించిన జిపిఎస్ లాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు.
ఈ విధానంలో కన్యుకేషన్ పెరిగిన పిఆర్‌సిలు, డిఎ విషయాలు లేవని తెలిపారు. 10 శాతం ఉద్యోగుల నుంచి కట్టించుకునే సొమ్ము షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల ఉద్యోగులకు ఉపయోగం కాదని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.మురళీమోహనరావు, ఎస్.కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యారంగా సంస్కరణ వల్ల ప్రభుత్వ విద్యారంగం విచ్ఛిన్నమై విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.
పని సర్దుబాటు అవసరం మేరకు చేస్తామని చెప్పి ఇప్పుడు గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. అలాగే అక్టోబర్ 20, 21 తేదీల్లో జరిగే జిల్లా స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.భాస్కరరావు, సహాధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి, రాష్ట్ర కార్యదర్శి ఆర్.మోహన్‌రావు పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి : ఎపిటిఎఫ్‌కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ వంటిదేనని, సర్వీసు వ్యవధితో సంబంధం లేకుండా అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయడమే న్యాయ సమ్మతమని ఎపిటిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్, బాలకష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీముకు మరో రూపమే తప్ప పాత పెన్షన్ విధానం కాదన్నారు. సిపిఎస్ వలే ఉద్యోగి జీతంలో నుండి 10శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కొత్త పెన్షన్స్ పథకాన్ని ఎపిటిఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు ప్రతికూలమైన ఈ పథకాన్ని తిరస్కరిస్తూ పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.