Weight Loss Tips హోటల్ ఫుడ్‌తో పోల్చితే ఇంట్లో తయారుచేసిన ఆహారం అంత రుచిగా ఉండదు. అందుకే చాలా మంది ప్రతిరోజూ బయటి ఆహార తినడానికి ఆసక్తి చూపుతారు. ఫలితంగా జరిగిందేదో జరుగుతుంది. రోజురోజుకీ బరువు అమాంతం పెరిగిపోతుంటారు. సమతుల్య ఆహారం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది.
Weight Loss Tips
బరువు అదుపులో ఉంచుకోవాలంటే సరైన జీవితాన్ని గడపడం చాలా అవసరం. తగినంత నీరు, మితమైన నిద్ర కూడా అవసరం. ఓ అమెరికన్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే తినడానికి ముందు నీరు తాగాలని పేర్కొంది.
ఒక ప్రయోగంలో 12 వారాల పాటు భోజనానికి ముందు నీరు తాగిన వారు వేగంగా బరువు తగ్గారని తేలింది. దీనికి విరుద్ధంగా భోజనానికి ముందు నీరు త్రాగని వారు బరువు తగ్గనట్లు గుర్తించారు. ఈ అధ్యయనం ప్రకారం అల్పాహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్లు ఉండాలి. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా తినాలనే కోరిక పుట్టదు. అందుకు ఉడకబెట్టిన గుడ్లను ఉదయాన్నే తినడం మంచిది.
పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, ఓట్స్, క్వినోవా వంటి ఆహారాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఎక్కువ ప్రోటీన్ తినడం, కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. అలాగే ప్రాసెస్డ్ ప్రొటీన్ రిచ్ ఫుడ్ తినడం వెంటనే మానుకోవాలి.
మితమైన ఆహారం, వ్యాయామం, నీళ్లతో పాటు బరువు తగ్గడానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. జీవక్రియ చెదిరిపోతే, బరువు తగ్గడం కష్టం. బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మంచి శరీరక సౌష్టవం పొందాలంటే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలంటున్నారు నిపుణులు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.