Tuesday, September 17, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Andhra PradeshAP Ganesh Mandapam Permission Application Process...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

AP Ganesh Mandapam Permission Application Process 2024

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

AP Ganesh Mandapam Permission Application Process వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండ్ విధానమును ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చి సులభతరం చేసింది .

AP Ganesh Mandapam Permission Application Process – Vinayaka Chaviti Mandapam Online Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం Vinayaka Chaviti Mandapam ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకుని వచ్చింది. ఇంతకు ముందు వినాయక మండపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలని ఉండేది.

AP Ganesh Mandapam Application Through WhatsApp 

AP Ganesh Mandapam Permission Application Process ఇందులో భాగంగా ప్రజలు 7995095800 మొబైల్ నంబర్ కు WhatsApp ద్వారా Hi అని సందేశం పంపిస్తే చాలు, నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం WhatsApp ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్ కు వస్తుంది.

AP Ganesh Mandapam Application Guidlines 

  1. ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా ట్రాఫిక్  ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
  2. కమిటీ సభ్యులు ఆధార్ మరియు చిరునామా లు ఫోన్ నెంబర్ లు తీసుకోవాలి, పూజ దినముల వివరములు తీసుకోవాలి.
  3. వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని, స్పీకర్లను ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే వినియోగించాలి.
  4. ఉత్సవ మండపాలు వద్ద విగ్రహాలకు భద్రతగా కమిటీ సభ్యులు రాత్రులు మండపాలు వద్దనే ఉండాలి.
  5. వినాయక నిమజ్జనం చేసే సమయాలను మరియు రూట్ మ్యాప్ ను ముందుగా పోలీసు వారికి తెలియ చేయాలి.
  6. వినాయక నిమజ్జనం ఉపయోగించే వాహనం యొక్క వివరాలు, రికార్డ్స్, డ్రైవరు లైసెన్సు తీసుకోవాలి మరియు మద్యం చేవించి వాహనం నడపరాదు.
  7. డ్రైవరు వద్ద అండర్ టేకింగ్ లెటర్ తీసుకోవాలి.
  8. వినాయక చవితి మండపాల వద్ద ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా వాహనాలను ఒక ప్రక్కగా పార్కింగ్ చేసేలాగా ఏర్పాట్లను చేయాలి.
  9. దీపారాధన సమయం నందు మరియు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైన fire extinguisher అందుబాటులో ఉంచుకోవాలి.
  10. వినాయక ఉత్సవ మండపాల వద్ద గాని ఊరేగింపులలో గాని బాణసంచాను ఉపయోగించరాదు.
  11. వినాయక నిమజ్జనం సమయంలో అశ్లీల డాన్సులను గాని డీజే శబ్దాలు ఎక్కువగా చేయకూడదు.
  12. వ్యక్తులను రెచ్చగొట్టే విదంగా ప్రవర్తించకూడదు
  13. బలవంతపు చందాలు, వసూళ్ళు గాని మరియు దర్శనాల టికెట్ల గానీ పెట్టరాదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే వాటిపై ఫిర్యాదులు చేయుటకు డయల్ 100 కి ఫోన్ లేదా 6309990933 నంబరుకు వాట్స్ అప్ చేయగలరు.
  14. ప్రతి మండపానికి వారి సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీసును కో-ఆర్డినేటర్ గా నియమించడం జరుగును.
  15. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఉపయోగించరాదని మరియు మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించవలెనని సూచన చేయడమైనది.
  16. హుండీ రాత్రి పుట మండపం లో ఉంచ రాదు.
  17. కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి, నిర్వాహకులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
  18. మండపాలు ఉండే ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేయరాదు.
  19. నిమజ్జనం నిర్దేశించిన సమయములో ఊరేగింపు ప్రారంభించి, నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిమజ్జనము చేయవలెను.
  20. నిమజ్జనం రాత్రి 10 గంటల లోపు ముగించాలి.
  21. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేయడమైనది.
  22. విగ్రహం వద్ద పాయింట్ బుక్ మరియు రిజిస్టర్ ఉండాలి

AP Ganesh Mandapam Permission Application Process

ap ganesh mandapam permission application process 2024

Step 1 : ముందుగా  

https://ganeshutsav.net

సైట్ ను ఓపెన్ చెయ్యండి .

Step 2 : New Application అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి .

ap ganesh mandapam permission application process 2024

Step 3 : Mobile Number ఎంటర్ చేసి Generate OTP పై క్లిక్ చేయాలి .

ap ganesh mandapam permission application process 2024

Step 4 : Mobile Number వచ్చే OTP  ను ఎంటర్ చేసి తరువాత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది .

ap ganesh mandapam permission application process 2024

Step 5 :  కింద చూపిన వివరాలు ఎంటర్ చేయాలి .

  • Applicant Name 
  • Applicant Email 
  • Applicant Address 
  • Applicant Association Name 
  • Installation Place
    • Temple
    • Apartment
    • Community Hall
    • Govt / Municipal Land
    • Private Place
    • Other
  • Installation D.No/Location 
  • Installation Street/Colony 
  • District/Commissionerate
  • City/Sub-Division 
  • Police Station Limits
  • Idol Height (Feet) 
  • Pandal Height (Feet) 
  • Committee Member – 1 Name 
  • Committee Member – 1 Mobile 
  • Committee Member – 2 Name 
  • Committee Member – 2 Mobile 
  • Committee Member – 3 Name 
  • Committee Member – 3 Mobile 
  • Committee Member – 4 Name 
  • Committee Member – 4 Mobile 
  • Committee Member – 5 Name 
  • Committee Member – 5 Mobile 
  • Immersion Date dd-mm-2024 
  • Immersion Time –:– 
  • Immersion Location 
  • Immersion Transport Type
    • Auto
    • Mini Truck
    • Tractor
    • Truck
    • Crane
    • Spot Immersion

వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్.హెచ్.ఓ (SHO) గారికి వెళ్తుంది. ఎస్.హెచ్.ఓ (SHO) గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్ని మాపక శాఖ మరియు విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మంటపం ఏర్పాటు చేయు ప్రదేశమును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి మండపాలు ఏర్పాటు నియమాలకు అనుగుణంగా ఉన్నట్లు ఐతే మీసేవలో చలాన కట్టి దరఖాస్తు పూర్తి చేయాలి .

AP Ganesh Mandapam Application Status 

https://ganeshutsav.net/applicationStatus

ఫోను నంబరు ఎంటర్ చేసినట్లయితే అనుమతులు మంజూరు చేస్తూ నిరభ్యంతర పత్రం, పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ డౌన్లోడు అవుతుందన్నారు. డౌన్లోడు చేసుకున్న ‘నో అబ్జక్షన్ సర్టిఫికేటు’ (NOC) మరియు పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ ను లేమినేషను చేసి, ఉత్సవ మండపంలో తనిఖీలు చేపట్టేందుకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉంచాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this