ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ రోజు (నవంబరు 4) ఉదయం 11 గంటల తర్వాత ట్విటర్ ద్వారా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతల్లో టెట్ పరీక్షలు జరిగాయి. దరఖాస్తు చేసిన 4,27,300 మంది అభ్యర్థుల్లో 86.28% అంటే 3,68,661 మంది పరీక్షలు రాశారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో 20% వెయిటేజీ ఉండటంతో టెట్ స్కోరు కీలకంగా మారింది. ఈ ఫలితాల వెంటనే డీఎస్సీ (DSC 2024) నోటిఫికేషన్ విడుదలవుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. Check APTET July 2024 Rsults in Official website.
https://aptet.apcfss.in/CandidateLogin.do
రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాం. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారు. ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ నా శుభాకాంక్షలు.
APTET July 2024 Rsults Links
Official Link
https://aptet.apcfss.in/CandidateLogin.do