వివిధ సబ్జెక్టులలో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారు చదువులో ముందుండేలా చేసేందుకు విద్యాశాఖ నిర్ణ యించింది. ఇందుకోసం వారికి రెమిడియల్ తరగతులు నిర్వహించనుంది. ఈ తరగతుల్లో ప్రత్యేక బోధన చేసి ఆయా అంశాల్లో లోటు పాట్లు లేకుండా వారిని తీర్చిదిద్దనుంది. ఇటీ వల నిర్వహించిన ఫార్మేటివ్ పరీక్షలను ఆధా రం చేసుకుని చదువులో వెనుకబడిన విద్యార్థు లను గుర్తించి రెమిడియల్ (చక్కదిద్దే) తరగ తులు నిర్వహించాలని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. నిర్మాణాత్మక పరీక్షలు-1లో విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాం కనం చేసి సబ్జెక్టులలో వారి ప్రగతిని అంచనా వేయాలని సూచించింది. సబ్జెక్టులలో 35 శాతం కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు వెంటనే రెమిడియల్ శిక్షణ చేపట్టాలని పేర్కొంది. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు లేదా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించాలి. తరచూ గైర్హాజరయ్యే విద్యా ర్థులను గుర్తించడం, వారు బడికి రాని రోజు ల్లో జరిగిన పాఠాల గురించి, నోట్సుల గురిం చి చెప్పి తర్ఫీదు ఇవ్వాలి. తోటి విద్యార్థుల సహకారంతో నోట్సులు పూర్తిచేసుకునేలా చూడాలి. పరీక్ష సమాధాన పత్రాలను విద్యార్థులకు ఇచ్చి ఆయా పుస్తకాలను చూసి అవే ప్రశ్నలకు సమాధానాలు రాయించాలని, తద్వారా వారు సమాధాన పత్రంలో ఎక్కడ పొరపాటు చేశారో తెలుసుకొనేలా చేయాలని సూచించింది. దీనిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష చేయాలని, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు, డీఈవోలు, ఆర్జేడీలు ప్రతినెలా సమీక్ష చేయాలని తెలిపింది.