PRC Fitment 23% Proposed: పి.ఆర్.సి ఫిట్మెంట్ 23 శాతం ను ప్రతిపాదించిన ప్రభుత్వం
- పి ఆర్ సి సంక్షిప్త నివేదిక విడుదల
- ఒక పేజీలో వివరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ రోజు అనగా ది.29.10.2021 న జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌంసిల్ మీటింగ్ లో ఇచ్చిన బ్రీఫ్ రిపోర్టు లో 23% ఫిట్మెంట్ ను ప్రతిపాదించిన ప్రభుత్వం.
న్యూస్ టోన్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ నివేదిక ముఖ్యాంశాలు ఒక పేజీలో ప్రభుత్వం విడుదల చేసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివరాలు అందించింది. పూర్తి నివేదికను మూడు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనుంది. ఈ నివేదిక లో ఫిట్మెంట్ తేల్చేందుకు ఉద్దేశించిన ఫార్ములా ప్రకారం 23 శాతమే ఫిట్మెంట్ లెక్క తేలిందని కమిషన్ పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున తదనుగుణంగా వేతన కమిషన్ ప్రభుత్వ సూచనతో సర్దుబాటు చేసిందని పేర్కొంది. మరో మూడు పాయింట్లు ఆధారంగా ఫిట్మెంట్ 27 శాతం వరకు అమలు చేయవచ్చని సూచించింది. ఇందుకు సంబంధించి ఈ శాతాన్ని ఎలా సాధించిందో కొన్ని నిబంధనలు వేతన సవరణ కమిషన్ పేర్కొంది.