India Covid Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో వేలాది మంది జనం తమకు వ్యాక్సిన్ రక్షణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
మరోవైపు కొందరు మాత్రం వ్యాక్సిన్ల పట్ల అపనమ్మకంతో వాటిని నిరాకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం కారణంగా చాలా మందిలో వ్యాక్సిన్ల పట్ల అపోహలు నెలకొంటున్నాయి. థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో వ్యాక్సిన్లు సురక్షితమని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తుండటంతో టీకా తీసుకునేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కాగా వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించి తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా 77 శాతం రక్షణ లభిస్తున్నట్లు వైద్య నిపుణుల అధ్యయనం తేల్చింది. అలాగే, రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఐసీయూలో చేరాల్సిన అవసరం లేకుండా 94 శాతం రక్షణ కల్పిస్తుండగా..మళ్లీ కరోనా ఇన్‌ఫెక్టన్ బారినపడకుండా 65 శాతం రక్షణ కల్పిస్తోంది.
Covid Vaccine
ఇదిలావుంటే, కోవిడ్ ఉధృతి తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య కూడా అనూహ్యంగా దిగి వస్తున్నాయి. 72 రోజుల కనిష్టస్థాయికి చేరాయి. తాజాగా 60వేల471 కేసులు నమోదు కాగా.. ఒక్కరోజులో 2,726 మంది చనిపోయారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో పిల్లలపై కరోనా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. 12 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న వారిపై ఇప్పటి వరకు ట్రయల్స్ ప్రక్రియ పూర్తి కాగా.. నుంచి నుంచి 6 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇంకా వేగం పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 కోట్ల 53 లక్షల 5 వేల 366 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 20 కోట్ల 78 లక్షల 30 వేల 971 మందికి మొదటి డోస్ అందగా.. 4 కోట్ల 74 లక్షల 74 వేల 971 మందికి రెండో డోస్ పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 8 లక్షల 15 వేల 707 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఏపీలో ఇప్పటి వరకు కోటి 23 లక్షల 38 వేల 339 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 97 లక్షల ఒక వేయి 257 మందికి మొదటి డోస్ అందగా.. 26 లక్షల 37 వేల 82 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తంగా 82 లక్షల 6 వేల 333 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 68 లక్షల 55 వేల 777 మంది ఉండగా.. రెండో డోస్ పూర్తైన వారు 13 లక్షల 50 వేల 556 మంది ఉన్నారు.
ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 22 కోట్ల 43 లక్షల 88 వేల 221 మందికి covishield అందితే.. 3 కోట్ల 8 లక్షల 90 వేల 219 మందికి covaxin వ్యాక్సిన్లు అందాయి.
18 ఏళ్ల పై బడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 28 కోట్ల 85 లక్షల 35 వేల 508 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 12 కోట్ల 20 లక్షల 47 వేల 492 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 16 కోట్ల 64 లక్షల 88 వేల 16 మంది 45 ఏళ్ల పై బడిన వారు.