Income Tax : పన్ను చెల్లింపులు మరింత సులభంగా చెల్లించే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ.
మరింత సరళంగా..పన్నుల ప్రాసెస్ జరిగేలా ఈ ఫైలింగ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. 2021, జూన్ 07వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆదాయపను పన్నుశాఖ వెల్లడించింది.
Income Tax Department : పన్ను చెల్లింపులు మరింత సులభంగా చెల్లించే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. మరింత సరళంగా..పన్నుల ప్రాసెస్ జరిగేలా ఈ ఫైలింగ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. 2021, జూన్ 07వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆదాయపను పన్నుశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న http://incometaxindiaefiling.gov.in స్థానంలో www.incometax.gov.in ను ప్రారంభించనుంది.
ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కొత్త పోర్టల్ ప్రారంభమవుతున్న దృష్ట్యా…జూన్ 01 నుంచి 06వ తేదీ వరకు ఈ ఫైలింగ్ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు యూజర్ మాన్యువల్, వీడియో వంటివి పొందుపరిచింది. అప్‌లోడ్‌లు, ఇంటరాక్షన్లు, పెండింగ్ యాక్షన్లు ఒకే డ్యాష్ బోర్డుపై కన్పిస్తాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. కొత్త పోర్టల్ సురక్షితమైన లాగిన్, చాట్ బాట్, హెల్ప్ డెస్క్ ఇతర ఫీచర్లు ఉన్నాయి.
ఐటీ రిటర్న్ లను దాఖలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా దీనిని రూపొందించడం జరిగిందని ఐటీ శాఖ వెల్లడించింది. నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్, యూపీఐ, ఎన్ఈఎఫ్ టీ ఇతర మల్టీపుల్ పేమెంట్ ఆప్షన్లను పొందుపరిచినట్లు తెలిపింది. మొత్తంగా టాక్స్ ప్లేయర్లకు సులభతరంగా, తమ తమ అకౌంట్లను చెక్ చేసుకొనే అవకాశం ఉందని వెల్లడించింది.