Nellore Krishnapatnam : నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఉన్నట్టా ? లేనట్టా ? అనే చర్చ జరుగుతోంది.
ఈ మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. 2021, జూన్ 07వ తేదీ సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Anandayya Medicine : నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఉన్నట్టా ? లేనట్టా ? అనే చర్చ జరుగుతోంది. ఈ మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. 2021, జూన్ 07వ తేదీ సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..మందు పరికరాలు తయారు చేసే మిక్సీ, గ్రైండర్లు ఏవీ అందుబాటులో లేవని ఆనందయ్య అంటున్నారు.
మరి సోమవారం నుంచి మందు పంపిణీ సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసలు మందు పంపిణీ చేస్తారా ? లేదా ? దానిపై ఆనందయ్య క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని సమాచారం. మందు పంపిణీ చేస్తారని జోరుగా ప్రచారం కావడంతో..భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మందు పంపిణీ కాకపోతే పరిస్థితి ఏంటి ? అనే చర్చ జరుగుతోంది. ఒకరోజు అటూ ఇటూగా మందు పంపిణీ మొదలవుతుందని ఆనందయ్య వెల్లడిస్తున్నారని సమాచారం. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందించిన తరువాతే రాష్ట్రవ్యాప్తంగా మందు పంపిణీ చేయనున్నట్లు ఆనందయ్య తొలుత ప్రకటించారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేక వాహనాల్లో సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మరోవైపు…ఆనందయ్య మందుపై వివాదం ముదురుతోంది. సేశ్రిత టెక్నాలజీపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై… ఆ సంస్థ ఎండీ నర్మదా రెడ్డి కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసు నమోదు చేశారు పోలీసులు. తమ ప్రాజెక్ట్‌పై సోమిరెడ్డివి చేసినవి తప్పుడు ఆరోపణలన్నారు నర్మదారెడ్డి. వెబ్‌సైట్ పూర్తి కాకుండానే సాఫ్ట్‌వేర్ చోరీ చేశారని ఆరోపించారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు నర్మదారెడ్డి.
నియోజకవర్గం ప్రజల కోసం సుమారు రెండున్నర లక్షల మందికి పైగా మందు ప్యాకెట్లను సిద్ధం చేశామన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనందయ్య తెలిపారు. మందు పంపిణీ మొత్తం కృష్ణపట్నం నుంచే జరుగుతుందన్నారు.
ఆనందయ్య మందు..తొలుత నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో మందు పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచే ఈ మందు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కృష్ణపట్నానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మందు పంపిణీ జరుగుతుండటంతో వెంటనే పోలీసులు ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.