విద్యారంగంలో ఇప్పటికే పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం
తీసుకున్నారు.. అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై
సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అటానమస్ కాలేజీల్లో పరీక్షల
విధానంలో మార్పులకు ఆదేశించారు.. అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు
తయారు చేసుకునే విధానం రద్దు చేయాలని.. అన్ని కాలేజీలకీ జేఎన్టీయూ
తయారుచేసిన ప్రశ్నపత్రాలే అందజేయాలని తెలిపారు. అటానమస్, నాన్ అటానమస్
కాలేజీలకు జేఎన్టీయూ రూపొందించిన ప్రశ్నపత్నాలు ఇవ్వాలని స్పష్టం చేశారు
సీఎం వైఎస్ జగన్.. వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని నిర్ణయం
తీసుకున్నారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు
వెల్లడించారు.