Bread Business : ఇంటి నుంచి వ్యాపారం చేయాలనుకునేవారికి ఈ వ్యాపారం
చలా చక్కగా నడుస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎటువంటి ఖర్చు లేకుండా బ్రెడ్
తయారీ ప్రారంభించండి. నెలకు లక్షల్లో సంపాదించండి..
కరోనా వల్ల హోం నీడ్ పుడ్స్కి డిమాండ్ బాగా పెరుగుతోంది. అందుకే బేకరీ
పుడ్స్పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. నిరుద్యోగులు ఇంటి వద్ద పదివేల
పెట్టుబడితో బ్రెడ్ తయారీ చేసి లక్షలో లభాలు సంపాదించవచ్చు.
బేకరీ ఉత్పత్తులకు భారతదేశం ఒక ప్రధాన ఉత్పాదక కేంద్రం. యుఎస్, చైనా తర్వాత రెండో అతిపెద్ద బిస్కెట్ ఉత్పత్తి చేసే దేశం ఇండియానే.
గత ఆర్థిక సంవత్సరంలో అసాధారణంగా 17,000 కోట్ల రూపాయల బిజినెస్ ఈ రంగంలో
నడిచింది. రాబోయే 3.4 సంవత్సరాల్లో 13.15 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు
అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న పట్టణీకరణ, నమ్మక మైన ఆహార పదార్థాల వాడకమే బేకరీ ఉత్పత్తులకు డిమాండ్ పెంచే ప్రధాన కారకాలు.
బ్రెడ్ తయారీ వ్యాపారం వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు.