మన దేశ జనాభాలో 10 శాతం మంది
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం
చేస్తున్నాయి. వీటన్నింటికి ప్రధాన కారణం మనం కిడ్నీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ
వహించకపోవడమే.
ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీని
నిర్మూలనకు, ప్రజల్లో కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి
11న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్యం విషయంలో
నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భారత్లో ప్రతి ఏటా సుమారు రెండున్నర లక్షల
మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు
చెబుతున్నాయి. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల
వ్యాధులతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటన్నింటికి
ప్రధాన కారణం మనం కిడ్నీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమే. అందువల్ల, ఈ
సమస్య నుంచి బయటపడేందుకు, మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి పాటించాల్సిన
చిట్కాలను తెలుసుకోండి.
నీరు ఎక్కువగా తీసుకోండి
సహజంగా వేసవిలో మనకు ఎక్కువ చెమట పడుతుంది. కాబట్టి, మనల్ని మనం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం తప్పనిసరి. దీనికి గాను రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల నీరు త్రాగడంతో పాటు నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. తద్వారా మీ కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. వృద్ధులకు కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లైతే, సంబంధిత వైద్యుడి సూచన ప్రకారం ఆహార పద్ధతులను అనుసరించండి. అలాగే, వేసవిలో సమతులాహారం తీసుకోవడానికే ప్రాధ్యతనివ్వండి
ఉప్పు వాడకాన్ని తగ్గించండి
అదనపు ఉప్పు వినియోగం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేసి రక్తపోటును పెంచుతుంది. అందువల్ల, మీ ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించండి. సాధారణంగా, మనం రోజుకు 7 నుండి 10 గ్రాముల ఉప్పును తీసుకుంటాము. కాబట్టి, దీన్ని 4 నుండి 5 గ్రాములకు తగ్గించాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించకపోతే.. మూత్ర పిండ సమస్యలతో పాటు గుండె సమస్యలు, హైపర్టెన్షన్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి.
తగినంత ఫైబర్ తీసుకోండి
అధిక ఫైబర్ కలిగిన ఆహారం కేవలం జీర్ణక్రియను సులభతరం చేయడంలోనే కాదు, మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అందుకే, సికెడి (క్రానిక్ కిడ్నీ డిసీజ్)తో బాధపడుతున్న రోగులు ఎక్కువ ఫైబర్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. దీనికి గాను మీ రోజువారీ ఆహారంలో బీన్స్, బఠానీలు, బెర్రీలు, పుచ్చకాయ మొదలైన ముడి పదార్థాలను జోడించండి.
జంక్ ఫుడ్ మానుకోండి
సహజంగా మనం బయట తినే జంక్ ఫుడ్ ఎంతో అనారోగ్యకరమైంది. వీటిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండ సమస్యలను పెంచుతాయి. కాబట్టి, దీనికి బదులుగా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి, మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ధూమపానం మానుకోండి, రోజూ వ్యాయామం చేయండని డాక్టర్లు సలహాలిస్తున్నారు.
భారీ వ్యాయామాలు చేయకండి
వ్యాయామం చేయడం, చురుకైన జీవితాన్ని గడపడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కానీ అతి ఏదైనా ప్రమాదకరం. అందువల్ల, ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలను చేయకండి. ఇవి కండరాలకు గాయాలను ఏర్పరుస్తాయి. తీవ్రమైన కండరాల గాయం కొన్నిసార్లు రక్తప్రవాహంలో ప్రోటీన్ లీకేజీకి దారితీస్తుంది. ఇది క్రమంగా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.
మందుల వాడకాన్ని తగ్గించండి
ఇండోమెథాసిన్, కాంబిఫ్లామ్, ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్లను అవసరం లేకున్న వాడకండి. ఎందుకంటే ఇవి మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. అంతే కాదు.. అవసరమైతే తప్ప బ్రూఫెన్ లేదా వోవెరాన్ వంటి పెయిన్ కిల్లర్లను అస్సలు వాడకండి.
చక్కెర, రక్తపోటును అదుపులో ఉంచండి
మీ చక్కెర, రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. ఒకవేళ, మీరు డయాబెటిక్ లేదా బీపీ పేషెంట్ అయితే, మీ వైద్యుడు సూచించిన విధంగా మీ మందులను తీసుకోండి. ఎందుకంటే, డయాబెటిస్, రక్తపోటు వంటివి మూత్రపిండాలను గణనీయంగా దెబ్బతీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ లక్షణాలతో గుర్తించండి..
కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టేందుకు, దాన్ని మొదట్లోనే గుర్తించడం చాలా కీలకం. కొన్ని లక్షణాలతో కిడ్నీ సమస్యలను సులభంగా గుర్తుపట్టవచ్చు. ముఖ్యంగా మూత్రం రంగు మారడం.- మూత్రం చెడు వాసన రావడం, మూత్రం నురుగు రావడం,- మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి కలగడం, – కళ్ళ చుట్టూ వాపు, అలసట రావడం, – వికారం, వాంతులు, -పొడి దగ్గు, దురద,- వెన్నునొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలతో కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.
కిడ్నీ సమస్యను గుర్తించడమెలా? ఈ సమస్యకు పరిష్కార మార్గాలేమిటి? తెలుసుకోండి WORLD KIDNEY DAY 2021 KIDNEY PROBLEMS PRECAUTIONS
Potoshiam పేషెయంట్ below 3 undi. Solution cheppagalaru. Since 3years nundi