చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష- మార్గ దర్శకాలు
చదవడం మాకిష్టం లో భాగంగా 3 నుండి 9 తరగతుల బాలలందరికీ ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.
ప్రధమ్ వారు రూపొందించిన ప్రశ్న ప్యతంతో ప్రారంభ పరీక్ష జరపాలి.
ప్రశ్న పత్రాలు 4 ఉంటాయి, సాంపిల్-1 మూడవ తరగతికి, సాంపిల్-2 నాలుగు అయిదు తరగతులకు, సాంపిల్-3 ఆరు, ఏడు తరగతులకు, సాంపిల్-4 ఎనిమిది తొమ్మిది తరగతులకు ఉపయోగించాలి. తొమ్మిదవ తరగతికి నవంబర్ లో పరీక్ష పెట్టినట్లయితే అవసరంలేదు.
ప్రశ్న పతంలో నాలుగు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో పూర్తి సాయి కథాంశం రెండో విభాగంలో వాక్యాలు మూడో విభాగంలో పదాలు నాలుగో విభాగంలో అక్షరాలూ ఉంటాయి.
ప్రశ్న ప్యృత్రం ఉపాధ్యాయుని దగ్గర మాత్రమే ఉంటుంది. పిల్లలకు ఇవ్వబడదు.
ఇది పఠన సామర్ద్యాన్ని పరిశీలించే పరీక్ష కాబట్టి ఒక్కొక్క విద్యార్హితో వ్యక్తిగతంగా చదివించి సాయిని నిర్హారించాలి.
ప్రశ్న ప్యతంలోని మొదటి విభాగం పూర్తి పాయి కథాంశాన్ని మొదటగా చదివించాలి.
ఈ విభాగాన్ని చదివించేటపుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు.
౫ విడి విడి పదాలుగా కాకుండా వాక్యం మొత్తాన్ని చదవాలి.
౫ విరామ చిహ్నాలను పాటిస్తూ చదవాలి.
౫ కూడబలుక్కుని చదివినట్లుగా ఉండరాదు.
౫ పదాలు స్పష్టంగా, ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి.
మొదటి భాగం చదవగలిగితే ఇక మిగిలిన విభాగాలు చదివించడం అవసరం లేదు.ఆ విద్యార్దిని లెవల్-4 కు చెందినవానిగా గుర్తించాలి. మొదటి భాగం చదవలేకపోయినట్లయితే రెండవ విభాగంలోని వాక్యాలు చదివించాలి. ఈ విభాగం చదివించేటపుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు
౫ విడి విడి పదాలుగా కాకుండా వాక్యం మొత్తం చదవాలి.
౫ అన్ని వాక్యాలు స్పష్టంగా చదవాలి.
రెండవ విభాగం చదవగలిగితే మిగిలిన అంశాలు చదివించనవసరంలేదు.విద్యార్దిని ఆవల్-3 కు చెందిన వానిగా గుర్తించాలి.
రెండవ విభాగం చదవలేనట్లయితే మూడవ విభాగంలోని పదాలు చదివించాలి. ఈ విభాగం చదివేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు
౫ పట్టికలో ఇచ్చిన పదాలన్ని చదవాలి.
మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లపై క్లిక్ చేసి కావాల్సిన సమాచారం డౌన్లోడ్ చేసుకోండి
ఉత్తర్వులు కాపీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సమగ్ర శిక్ష వారు ఇచ్చిన రిపోర్టు సాఫ్ట్ కాపీ తయారు చేయడం జరిగింది. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. మరియు స్కూల్ కంసాలిడేటెడ్ రిపోర్టు లో ఇంగ్లీష్ కి సంబ్నధించిన రిపోర్టు కూడా ఇంసెర్ట్ చేయడం జరిగింది.
క్లాస్ రిపోర్టు: పి.డి.ఏఫ్ ఫైల్ లేదా ఎక్సెల్ ఫైల్
స్కూల్ రిపోర్టు: పి.డి.ఏఫ్ ఫైల్ లేదా ఎక్సెల్ ఫైల్