- నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రిలీవ్ అవ్వొచ్చు
- జాయిన్ అయిన 7 రోజుల్లో నాడు నేడు బాధ్యతలు వేరే వారికి అప్పచెప్పాలి
న్యూస్ టోన్, అమరావతి: నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల రిలీవింగ్ కు విద్యా శాఖ స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ కు కొత్తగా కేటాయించబడిన పాఠశాలల్లో చేరవచ్చు అని తెలిపింది. అయితే తాము విడిచి పెట్టిన నాడు నేడు పాఠశాల యొక్క నాడు నేడు కార్యక్రమ పూర్తి వివరాలను ఆ పాఠశాల యొక్క కొత్త ప్రధానోపాధ్యాయునికి 7 రోజుల లోపు నిర్ణీత ప్రొఫార్మాలలో (అకౌంట్ బుక్స్, మెటీరియల్స్, ప్లేయర్స్, పెయిడ్ బిల్స్, క్యాష్ ఇన్ హాండ్/బ్యాంక్ ) ఆ బాధ్యతలు/చార్జ్ అప్ప చెప్పాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. అలా 7 రోజుల లోపు చార్జ్ అప్ప చెప్పని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. బదిలీల వల్ల నాడు నేడు పనులకు ఏ విధమైన ఆటంకం కలుగకూడదని విద్యాశాఖ భావిస్తుంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
NADU NEDU HMS RELIEVING INSTRUCTIONS