- మధ్యాహ్న భోజన పథకం అవకతవకలపై సోషల్ ఆడిట్
- విద్యా శాఖ నిర్ణయం
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 1 : కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుస్థానే సరుకుల పంపిణీలో జరిగిన అక్ర మాలపై కాగ్ బృందాల ఆకస్మిక తనిఖీలతోపాటు, క్షేత్ర స్థాయిలో సోషల్ ఆడిట్ చేపట్టాలని విద్యా శాఖ నిర్ణయిం చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న 2,91,862 మంది బాల బాలిక లకు ఈ ఏడాది మార్చి నుంచి నెల నెలా డ్రై రేషన్‌లో భాగంగా బియ్యం, కోడి గుడ్లు, చిక్కీ పంపిణీ చేస్తున్నారు. గరిష్టంగా ఈ సరుకులను పది శాతం మంది విద్యార్థులకు పంపిణీ కాలేదని విద్యా శాఖ అనుమానిస్తోంది. డ్రైరేషన్ పంపిణీ చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రశీదులు లేకపోవడం, పలుచోట్ల గ్రామ / వార్డు వలంటీర్ల అవకత వకలు, కొన్నిచోట్ల చిక్కీల పంపిణీ లేకపోవడం మరికొన్ని చోట్ల గుడ్లు సగం మాత్రమే ఇవ్వడంపై విద్యాశాఖకు సమా చారం అందింది. డ్రై రేషన్ లబ్ధిదారుల వివరాల జాబితా ను స్కూలు నోటీసు బోర్డుల్లోను ప్రదర్శించలేదు. ఈ నేపథ్యంలో డ్రై రేషన్ సరుకుల పంపిణీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని నిర్ణయించారు. ఆడిట్‌లో భాగంగా ఆయా తరగతులు, కేటగిరీల వారీగా విద్యార్థులకు పంపిణీ అయిన డ్రై రేషన్ సరుకుల వివరాలు, వాటి పరిమాణం, ఎంఈవో లు, హెచ్‌ఎంలు, వలంటీర్ల భాగస్వామ్యం, వారి పాత్ర, రికా ర్డులు, రిజిష్టర్ల నిర్వహణ, స్కూలు పేరెంట్ కమిటీ చొరవ, సరుకుల పంపిణీపై విద్యార్థులు, పేరెంట్స్ సంతృప్తి స్థాయి లు, వంటి అంశాలపై పాఠశాల స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి నివేదికలు రూపొందిస్తారు. దీంతోపాటు కాగ్‌కు చెందిన ఆడిట్ టీమ్ జిల్లాలో ముందస్తు సమాచారం ఇవ్వ కుండా పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి స్పెషల్ ఆడిట్ ను చేయనుంది. డ్రై రేషన్ సరుకులు ఏ ఒక్క విద్యార్థికి అందలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదని, దీనికోసమే ఇప్పటి వరకూ జరిగిన పంపిణీపై సోషల్ ఆడిట్‌ను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
నవంబరుకు డ్రై రేషన్ విడుదల
నవంబర్ నెల డ్రై రేషన్ సరుకులను విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరికి 2.4 కిలోలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్క రికి 3.6 కిలోల ఆహార ధాన్యాలను / బియ్యం ఇవ్వను న్నారు. వీటితోపాటు కంది పప్పు, ఒక్కొక్కరికి 13 చొప్పున గుడ్లు, 13 చొప్పున చిక్కీలు పంపిణీ చేస్తారు. కొత్తగా అడ్మిషన్లు తీసు కున్న విద్యార్థులకు డ్రైరేషన్ సరుకులు ఇస్తారు. ప్రస్తుతం 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తరగతులకు హాజరై మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాలను తీసుకుంటున్న విద్యార్థులకు మాత్రం డ్రై రేషన్ సరుకులు ఇవ్వరు. ఒకవేళ భోజన పథకాన్ని వినియోగించుకోకపోతే సంబంధిత విద్యార్థులకు డ్రైరేషన్ సరుకులు ఇస్తారు. ఆ ప్రకారం జిల్లాలో 8, 9, 10 తరగ తులు చదువుతున్న విద్యా ర్థులు 93,158 మంది ఉండగా, వీరిలో భోజన పథకాన్ని ఎంత మంది వినియోగించుకుం టున్నదీ, లేనిదీ లెక్కలు తేల్చే పనిని ప్రారంభించారు. కంది పప్పు ఇవ్వని పక్షంలో కుకింగ్ ఛార్జీలను చెల్లిస్తారు. జిల్లాలో వచ్చే వారం నుంచి నవంబర్ డ్రై రేషన్ సరుకుల ను పంపిణీ చేయనున్నారు.
SOCIAL AUDIT ON MDM DRY RATION