చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 29: పలురకాల ట్రెజరీ బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌పడింది. జీపీఎఫ్, పీఎఫ్, లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ తదితర బిల్లులకు ట్రెజరీలో ఆమోదముద్ర పడుతున్నా, సీఎ్‌ఫఎంఎ్‌సలో చెల్లింపులు జరగడం లేదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ అవసరాల నిమిత్తం జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎ్‌ఫ)ను డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ నగదు కోసం జిల్లాలో అనేక మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండునెలలుగా జీపీఎఫ్ చెల్లింపులు, అటు లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ బిల్లుల చెల్లింపులూ ఆగిపోయాయి. దీంతో అత్యవసర పనుల నిమిత్తం దాచుకున్న సొమ్మునూ ప్రభుత్వం విడుదల చేయక పోవడం శోచనీయమని ఉద్యోగులు వాపోతున్నారు.
BREAK FOR TREASURY PAYMENTS